/rtv/media/media_files/2025/10/23/magical-drink-2025-10-23-07-55-10.jpg)
Magical drink
నేటి కాలంలో స్థూలకాయం (Obesity) చాలామందిని వేధిస్తున్న సమస్య. బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలు రానివారు చాలామంది ఉన్నారు. అలాంటివారి కోసం పోషకాహార నిపుణులు (Holistic Nutritionist) మ్యాజికల్ డ్రింక్ చిట్కాల గురించి చెబుతున్నారు. ఈ డ్రింక్ శరీరంలోని కొవ్వును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. మ్యాజికల్ డ్రింక్ తాగితే శరీరంలోని కొవ్వు త్వరగా ఎలా కరుగుతుందో..? 30 రోజుల్లో కనిపించే ఫలితాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మ్యాజికల్ డ్రింక్ కోసం..
ఈ బరువు తగ్గే డ్రింక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలను ముందుగా సిద్ధంగా పెట్టుకోవాలి. మెంతులు (Fenugreek Seeds) 3 టీస్పూన్లు, పసుపు పొడి (Turmeric Powder) 3 టీస్పూన్లు, వాము (Ajwain Seeds)3 టీస్పూన్లు, సోంపు (Fennel Seeds) 3 టీస్పూన్లు, దాల్చిన చెక్క (Cinnamon Sticks) 2 తీసుకోవాలి. పైన పేర్కొన్న అన్ని పదార్థాలను కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. తయారు చేసిన ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచాలి. ప్రతి భోజనానికి (లంచ్, డిన్నర్) 30 నిమిషాల ముందు.. అర గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఈ మిశ్రమాన్ని కలిపి తాగాలని నిపుణులు సూచించారు.
ఇది కూడా చదవండి: ముఖంపై ముడతలు రావొద్దంటే.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి!
ఈ డ్రింక్ తాగటం వల్ల జీవక్రియ పెరుగుతుంది. పసుపు, దాల్చిన చెక్క శరీరంలోని థర్మిక్ యాక్టివిటీని పెంచి, కొవ్వును వేగంగా కరిగించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా సోంపు, వాము గ్యాస్, ఉబ్బరం (Bloating) అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మెంతులు ఆకలిని నియంత్రించి.. అతిగా తినకుండా ఆపుతాయి. దీనివల్ల శరీరం శక్తి కోసం నిల్వ ఉన్న అదనపు కొవ్వును కరిగించడం ప్రారంభిస్తుంది. ఈ మసాలాల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, డిటాక్స్ గుణాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. బరువు తగ్గడానికి సహాయపడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ డ్రింక్‌ను రోజుకు రెండుసార్లు.. 30 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:చాయ్‌లో వేయకూడనివి ఇవే.. వేస్తే మీ ఆరోగ్యం సంగతి అంతే!!