HYD Crime News: పోర్న్ వీడియోలు చూస్తున్న వారికి బిగ్ షాక్.. తెలంగాణలో 15 మంది అరెస్ట్!

ఆన్‌లైన్‌లో చిన్నారుల పోర్న్ వీడియోలు చూసి, ఇతరులకు పంపుతున్న 15 మందిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌, యాదాద్రి భువనగిరి, వరంగల్‌, కరీంనగర్‌, జగద్గిరిగుట్ట, జగిత్యాల ప్రాంతాల్లో నిందితులను అరెస్టు చేశారు. ఇప్పటివరకు 294 కేసులు నమోదయ్యాయి.

New Update
child pornography videos sharing in telangana 15 members arrested

child pornography videos sharing in telangana 15 members arrested

పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టాబ్స్ అధిక సంఖ్యలో అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ వినియోగం అన్‌లిమిటెడ్ కావడంతో అశ్లీల వీడియోలు చూసే వారి సంఖ్య గతం కంటే మరింత అధికంగా పెరిగిపోయింది. వీటిని నియంత్రించేందుకు నేషనల్, ఇంటర్నేషనల్ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. 

HYD Crime

పోర్న్ చూసే వారిని వరుసగా అరెస్టు చేసి కటకటాల్లోకి పంపుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల అశ్లీల వీడియోలు (చైల్డ్ పోర్న్ గ్రఫీ) చూసి వాటిని ఇతరులకు షేర్ చేసిన వారిని టెక్నాలజీ సాయంతో గుర్తించి పట్టుకుంటున్నాయి. పోర్న్ వీడియోలు చూసి.. చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు.. వీటిని కంట్రోల్ చేసే పనిలో పడ్డాయి. 

తాజాగా మరోసారి తెలంగాణలో అలాంటి చర్యలకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారుల అశ్లీల వీడియోలు చూసి షేర్ చేసిన 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పలు జిల్లాల్లో వీరిని అరెస్టు చేసినట్లు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్‌ చెప్పారు. ఈ మేరకు ఈ కేసు వివరాలను మీడియాకు అప్పగించారు. 

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘నిందితులంతా తరచూ చిన్నపిల్లల పోర్న్‌ వీడియోలు చూస్తున్నారు. వాటిని ఇతరులకు పంపిస్తున్నారు. ఈ  విషయం మా దృష్టికి రాగానే రాష్ట్రవ్యాప్తంగా 34 కేసులు నమోదు చేశాం. ఆ తర్వాత రంగంలో దిగాం. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల పోలీసుల సహకారంతో దాడులు నిర్వహించాం. హైదరాబాద్‌, యాదాద్రి భువనగిరి, వరంగల్‌, కరీంనగర్‌, జగద్గిరిగుట్ట, జగిత్యాల  ప్రాంతాల్లో నిందితులను అరెస్టు చేశాం.’’ అని తెలిపారు. ‘‘చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌(సీపీయూ) సిబ్బంది ఇంటర్నెట్‌లో చైల్డ్ పోర్న్ వీడియోలు చూస్తున్న వారిపై నిఘా పెట్టి ఆ సమాచారాన్ని మాకు అందజేస్తుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 294 కేసులు నమోదు కాగా.. 110 మందిని అరెస్టు చేశాం’’ అని తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు