/rtv/media/media_files/2025/06/22/zepto-delivery-boy-attempt-to-rape-it-employee-in-chennai-2025-06-22-11-07-00.jpg)
zepto delivery boy attempt to rape it employee in chennai
తమిళనాడులో మరో కామాంధుడు రెచ్చిపోయాడు. డెలివరీ చేయడానికి వెళ్లి ఓ ఐటీ మహిళా ఉద్యోగినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై ఆమె ఆ డెలివరీ సంస్థకు కంప్లైంట్ చేసినా.. వారు కనీసం పట్టించుకోలేదని.. పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ డెలివరీ బాయ్‌ను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
zepto delivery boy
చెన్నైలోని కుబేరన్ నగర్ ప్రాంతం మడిపాక్కంకు చెందిన ఓ మహిళా ఐటీ ఉద్యోగిని ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ ‘జెప్టో’లో ఇంటికి కావాల్సిన కిరాణా సరుకులను ఆర్డర్ చేసింది. దీంతో గోపీనాథ్ అనే డెలివరీ బాయ్.. ఆమె ఆర్డర్‌ను తీసుకుని ఇంటికి వెళ్లాడు.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
అనంతరం సెల్‌ఫోన్‌లో ఛార్జింగ్ లేదని.. ఎమర్జెన్సీ పని ఉందని చెప్పి కాసేపు ఛార్జింగ్ పెట్టుకుంటానని కోరాడు. దీంతో ఆమె సరేనని ఇంట్లోకి పిలిచింది. ఆపై ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని గమనించిన గోపీనాథ్.. అదే అదునుగా భావించాడు. దీంతో ఆ మహిళపై ఒక్కసారిగా అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా అరవడంతో గోపీనాథ్ అక్కడ నుంచి పరారయ్యాడు.
Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?
వెంటనే ఆ మహిళ జెప్టో కంపెనీకి ఫిర్యాదు చేసింది. కానీ వారు ఎలాంటి రెస్పాన్స్ అందించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోపీనాథ్‌ను అరెస్టు చేశారు.
Also Read : బేగంపేటలో భారీ చోరీ..ఏకంగా రూ.48లక్షలు కాజేసి..