BIG BREAKING: వైష్ణోదేవి యాత్రలో తీవ్ర విషాదం.. 30 మందికి పైగా మృతి

గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. పలు జిల్లాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 30 మందికి పైగా మరణించారు. మృతుల్లో ఆరుగురు వైష్ణోదేవి యాత్రికులు కావడం మరింత విషాదం.

New Update
Vaishno Devi Yatra

Vaishno Devi Yatra

పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో జమ్మూకశ్మీర్‌ అతలాకుతలం అవుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. పలు జిల్లాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 30మందికి పైగా మరణించారు. మృతుల్లో ఆరుగురు వైష్ణోదేవి యాత్రికులు కావడం మరింత విషాదం. రియాసి జిల్లాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అర్ధకుమారి ప్రాంతానికి సమీపంలో చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, ఆర్మీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. యాత్రికుల భద్రత దృష్ట్యా, మాతా వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది.

వైష్ణోదేవి యాత్రలో జరిగిన ఈ దుర్ఘటనతో పాటు, జమ్మూ డివిజన్‌లోని దోడా జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా మరో నలుగురు మరణించారు. ఈ ఘటనలో పలు ఇళ్లు, ఇతర నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రావి నదిపై ఉన్న రంజిత్ సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో పాటు కథువా, సాంబా, రాంబన్, కిష్త్వార్ సహా పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా జమ్మూ డివిజన్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, చెరువులు మరియు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ, రెస్క్యూ ఆపరేషన్లను ముమ్మరం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు