Kedarnath Yatra: కేదార్నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్
కేదార్నాథ్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. కొండచరియలు విరిగిపడి 18 మంది గల్లంతయ్యారు. 16 వందల మంది యాత్రికులు కేదార్నాథ్లో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.