Landslides: కొండల్లో చిక్కుకున్న వందలాది టూరిస్టులు.. విరిగిపడ్డ కొండచరియలు

దట్టమైన కొండల నడుము వందలాది మంది పర్యటకు చిక్కుకున్నారు. మంగళవారం కొండచరియలు విరిగిపడటంతో దిరాంగ్-తవాంగ్ జాతీయ రహదారిని మూసివేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

New Update
Landslides on Dirang-Tawang

Landslides on Dirang-Tawang

దట్టమైన కొండల నడుమ వందలాది మంది పర్యటకు చిక్కుకున్నారు. మంగళవారం కొండచరియలు(Landslides) విరిగిపడటంతో దిరాంగ్-తవాంగ్ జాతీయ రహదారిని మూసివేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ప్రధాన జాతీయ రహదారి మూసివేయడంతో వందలాది మంది ప్రయాణికులు, పర్యాటకులు మధ్యలో చిక్కుకుపోయారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలే ఈ కొండచరియల విరిగిపడటానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. కొండపై నుంచి పెద్దపెద్ద బండరాళ్ళు, మట్టి పెళ్లలు ఒక్కసారిగా రోడ్డుపైకి జారిపడ్డాయి. దీనివల్ల సుమారు 120 మీటర్ల మేర రోడ్డు పూర్తిగా దెబ్బతింది. కొండచరియలు విరిగిపడిన సమయంలో అటుగా వెళ్తున్న కొన్ని వాహనాలపై రాళ్లు పడటంతో అవి ధ్వంసమయ్యాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read :  Dowry: కట్నం కోసం వేధింపులు.. నోట్లో వేడివేడి కత్తి పెట్టి.. ఇంకా చెప్పలేని ఘోరాలు!

Landslides On Dirang-Tawang 

పశ్చిమ కమెంగ్ జిల్లాలోని సప్పర్ క్యాంప్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే, అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై తమ వాహనాలను వెనక్కి తీసుకుపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ రహదారి మూసివేయడం వల్ల దిరాంగ్, తవాంగ్(Dirang-Tawang National Highway) మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇది పర్యాటక కేంద్రమైన తవాంగ్‌కు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారం, నీరు లభించక చాలామంది ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. రోడ్డుపై ఉన్న శిధిలాలను తొలగించడానికి భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు.

Also Read :  నిద్రలేచింది మహిళా లోకం.. ఎంప్లాయ్‌మెంట్‌లో వాళ్లే 40శాతం

ఈ మార్గాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని, అయితే వర్షాలు కొనసాగుతున్నందున పనులకు ఆటంకం కలుగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ మార్గం రేపటి నుంచి తిరిగి తెరుచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాకాలంలో ఇలాంటి కొండచరియలు విరిగిపడటం సాధారణంగా జరిగేదే అయినప్పటికీ, తాజా ఘటన తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు వర్షాకాలంలో పర్వత ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సహాయక చర్యల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Advertisment
తాజా కథనాలు