ఆ రాష్ట్రంలో ఆకస్మిక వరదలు.. 10 మంది మృతి

మేఘాలయాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా సౌత్‌గారో హిల్స్‌ అనే జిల్లాలో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 10 మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందినవాళ్లలో ఏడుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది.

New Update
Floods

Meghalaya Floods: మేఘాలయాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా సౌత్‌గారో హిల్స్‌ అనే జిల్లాలో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. కేవలం 24 గంటల పాటు కురిసినే వర్షాల వల్లే వరదలు రావడంతో ప్రాణనష్టం జరగడం ఆందోళన కలిగిస్తోంది. కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 10 మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందినవాళ్లలో ఏడుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం కాన్రాడ్‌ సంగ్మా సమీక్ష నిర్వహించారు. కొండచరియల వల్ల రాష్ట్రంలో జరిగిన ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 

Also Read: పెరగనున్న సిమెంట్ ధరలు.. బస్తాపై ఎంతంటే?

ఇటీవల కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కూడా కొండచరియలు విరిగిపడ్డ సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో దాదాపు 420 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా చూసుకున్న అనేక దేశాలు వరదల ప్రభావానికి గురవుతున్నాయి. ఇటీవల భారత్‌తో పాటు అమెరికా, చైనా, జపాన్‌లలో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులు చోటుచేసుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణానికి విఘాతం కలగించకుండా అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గ్లోబల్ వార్మిగ్ పెరగకుండా ఆపాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు