KTR: డీలిమిటేషన్ అలా చేస్తేనే మంచిది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని భావిస్తే.. ఆయా రాష్ట్రాలు అందిస్తున్న ఆర్థిక భాగస్వామ్యానికి తగ్గట్టు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో దేశ జనాభాలో 2.8 శాతం ఉండి.. జీడీపీకి 5.2 శాతం భాగస్వామ్యం అందిస్తోందన్నారు.