Harish Rao: బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? మరోసారి హరీశ్ రావు ఇంటికి కేటీఆర్

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుతో బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రెండోరొజు భేటీ అయ్యారు. హరీష్ రావు పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో కేటీఆర్‌ ఆయనతో రెండోరోజు సమావేశమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

New Update
KTR visits Harish Rao's house

KTR visits Harish Rao's house

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుతో బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రెండోరొజు భేటీ అయ్యారు.  హరీష్ రావు పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో కేటీఆర్‌ ఆయనతో రెండోరోజు సమావేశమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.హైదరాబాద్ కోకాపేటలోని హరీశ్‌రావు నివాసంలో కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. కేటీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో కేటీఆర్, హరీశ్‌రావు సమావేశమయ్యారు. నీటి పారుదల అంశాలు, రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.  

Also Read :  ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్

KTR Visits Harish Rao's House

కాగా నిన్న కూడా హరీష్‌రావుతో కేటీఆర్‌ సమావేశమయ్యారు.మాజీ మంత్రి హరీష్‌రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్‌తో భేటీ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన హరీష్ రావు తండ్రి ఆరోగ్య వివరాలను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. కోకాపేట హరీష్‌రావు నివాసంలో సమావేశమైన ఇరువురు నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీలో హరీష్‌రావు ప్రాముఖ్యత తగ్గిందన్న ప్రచారం జోరుగా జరుగుతుండటంతో దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలనే హరీష్ ‌రావుతో కేటీఆర్‌ భేటీ అయినట్లు తెలుస్తోంది. 

Also Read:  Rajasthan: తెరపైకి మరో సారి కృష్ణజింకల కేసు..రాజస్థాన్ ప్రభుత్వం సవాల్
 
హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్‌కు బీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీ లైన్‌ దాటనని ఇటీవల హరీష్‌రావు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్‌రావు మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించిన కానీ.. పని చేస్తానని హరీష్‌రావు తెలిపారు. వరంగల్ సభ తర్వాత పార్టీలో హరీష్‌రావు ప్రాముఖ్యత తగ్గిందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మండిపడుతోంది. దీంతో నేరుగా హరీష్ రావుతో మాట్లాడి సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్‌ సమావేశమైనట్లు సమాచారం. అయితే బీఆర్‌ఎస్‌లో ఏదో జరుగుతుందని ఇతర పార్టీల నేతలు చెబుతున్నారు.

Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?

Also Read :  శశిథరూర్‌కు కాంగ్రెస్ బిగ్ షాక్.. ఆయనకు అవకాశం ఇవ్వకుండా..!

 

kokapet | brs-working-president-ktr | brs-mla-harish-rao | harishrao | ktr | brs

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు