BIG BREAKING: కేటీఆర్కు వెన్ను పూసలో గాయం!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడ్దారు.  జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా స్లిప్ డిస్క్ (వెన్ను పూసకు గాయం) అయింది. దీంతో గాయపడిన కేటీఆర్ వెంటనే డాక్టర్లను సంప్రదించారు. డాక్టర్లు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకుని కోలుకోవాలని సలహా ఇచ్చారు.

New Update
ktr-gym

ktr-gym

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడ్దారు (Injury to KTR).  జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా స్లిప్ డిస్క్ (వెన్నుముకు గాయం) అయింది. దీంతో గాయపడిన కేటీఆర్ వెంటనే డాక్టర్లను సంప్రదించారు. డాక్టర్లు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకుని కోలుకోవాలని సలహా ఇచ్చారు. తాను త్వరలోనే కోలుకోవాలని ఆశిస్తున్నానని.. త్వరలో కోలుకుని ప్రజల ముందుకు వస్తానని  కేటీఆర్ ట్వీట్ లో తెలిపారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు.  


కేటీఆర్కు భారీ ఊరట!

మరోవైపు కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ పై  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  దీంతో ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసును కొట్టివేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి రూ.2500 కోట్లను పంపించారని కేటీఆర్‌ ఆరోపణలు చేయగా..  కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు అయింది.  ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం  కేసును కొట్టివేస్తూ తాజాగా తీర్పును వెలువరించింది.  

Advertisment
తాజా కథనాలు