/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
KTR
KTR : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ను ఉన్నత న్యాయ స్థానం కొట్టివేసింది.
ఇది కూడా చూడండి: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్
మూసీ ప్రాజెక్టు పేరుతో రూ.25 వేల కోట్ల నిధులను కాంగ్రెస్ పార్టీ తరలించిందంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలతో తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీసుస్టేషన్‌లో గత ఏడాది సెప్టెంబరు 30న కేసు నమోదైంది. ఈక్రమంలో కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. ఈ కేసు రాజకీయ ప్రేరేపిత కేసుగా భావించి తాజాగా ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది.
Also Read: మోహన్‌లాల్‌తో మాళవిక ‘హృదయపూర్వం’..
గత ఏడాది సెప్టెంబర్ 30న మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రూ.లక్షన్నర కోట్లు అంటూ ప్రచారం చేస్తున్న మూసీ ప్రాజెక్టు దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని, దేశంలో వచ్చే ఎన్నికల కోసం కావలసిన నిధుల కోసం కాంగ్రెస్ ఈ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంకులా వాడుకోవాలని చూస్తోందని కేటీఆర్ విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ సెప్టెంబర్ 30న ఉట్నూర్ పొలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా కేటీఆర్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ చేపట్టిన పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్లు 352, 353(2), 356(2) కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
Also Read: 'కింగ్‌డమ్' నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్ లోడింగ్..!