AP Crime : దంపతుల పంచాయతీలో కత్తిపోట్లు...ఏడుగురు స్పాట్లో...
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. భార్య భర్తల గొడవ విషయంలో నిర్వహించిన పంచాయతీ లో రగడ నెలకొంది. దీంతో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకోవడంతో ఏడుగురు గాయాలపాలయ్యారు. కట్నం కింద ఇవ్వాల్సిన పొలం విషయంలో ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది.