/rtv/media/media_files/2025/12/14/fotojet-4-2025-12-14-11-48-49.jpg)
Several people die in road accident while going to vote
Road Accident: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తూ వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట శివారు 161 జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు.
కుటుంబమంతా మృతి
కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన కురుమ లింగమయ్య(45), భార్య కురుమ సామప్ప(40) కుమారుడు సాయిలు(18) కూతురు మానస(8) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గ్రామానికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మాగి గ్రామానికి చెందిన దంపతులు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఓటు వేసేందుకు ద్విచక్రవాహనంపై నగరం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరు యువకులు మృతి
ఓటు వేసేందుకు స్వగ్రామానికి బైక్‌పై వెళ్తూ, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవపూర్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో బుర్ర నవీన్ (27), బుర్ర కల్యాణ్ (27) మృత్యువాత పడ్డారు. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి బైక్‌పై స్వగ్రామం హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించే క్రమంలో ఇద్దరూ మృతి చెందారు. మృతదేహాలను జనగామ ఏరియా ఆస్పత్రిలోని మార్చురికి తరలించారు.
ఎన్నికల ప్రచారంలో ఒత్తిడి.. సర్పంచి అభ్యర్థి మృతి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్‌లో సర్పంచి అభ్యర్థి మృతి చెందాడు. ఇక్కడి సర్పంచి స్థానానికి దామాల నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. కానీ ఎన్నికల ప్రచారంలో ఒత్తిడితో అస్వస్థతకు గురయ్యాడు. ఈక్రమంలో శనివారం సాయంత్రం ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు.
అభ్యర్థికి గుండెపోటు
తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాండూరు మేజర్ గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచ్ అభ్యర్థి వెంకటస్వామికి గుండెపోటు వచ్చింది. పోలింగ్ రోజు ఉదయం ఈ ఘటన జరగడంతో ఆయనను హుటాహుటిన మంచిర్యాల లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Follow Us