Khammam : చేతులు వెనక్కి విరిచి రెండు సార్లు.. మైనర్ బాలిక కేసులో సంచలన విషయాలు!

ఖమ్మం మైనర్ బాలిక కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 31న కొణిజర్ల మండలంలో 8వ తరగతి బాలికపై దారుణం జరిగింది. తమ్ముడు పడిపోయాడని గదిలోకి తీసుకెళ్లి ముగ్గురు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

New Update
khammam

ఖమ్మం మైనర్ బాలిక కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 31న కొణిజర్ల మండలంలో 8వ తరగతి బాలికపై దారుణం జరిగింది. తమ్ముడు పడిపోయాడని గదిలోకి తీసుకెళ్లి ముగ్గురు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఏడుస్తూ ఇంటికెళ్లిన బాలికపై మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు కిరాతకులు. చేతులు వెనక్కి విరిచి మరి బాలికపై ముగ్గురు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక కేకలు విని స్థానికులు రావడంతో నిందితులు పారిపోయారు. తల్లిదండ్రులు హైదరాబాద్ కు  వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

మాటలు నమ్మిన బాలికను

 బాలిక తన నాయనమ్మ, తాతయ్యలతో కలిసి సమీపంలోని ప్రార్థనా మందిరానికి వెళ్లింది. ప్రార్థనా మందిరం నుంచి ఒంటరిగా ఇంటికి వస్తున్న బాలికను, నిందితుల్లో ఒకడైన బాలుడు మార్గమధ్యలో ఆపాడు. మీ తమ్ముడు కిందపడిపోయాడు, దెబ్బలు తగిలాయి, వెంటనే రా అని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన బాలికను, ఆ బాలుడు తన స్నేహితుడైన 18 ఏళ్ల యువకుడి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ మరో బాలుడు ఉన్నాడు. అనంతరం ముగ్గురూ కలిసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఆ రాత్రి భయంతో ఎవరికీ చెప్పని బాలిక మరుసటిరోజు నొప్పులు భరించలేక నానమ్మకు జరిగిన విషయం అంతా  చెప్పింది మైనర్ బాలిక.. అనంతరం..  తల్లిదండ్రులు ఊరి నుంచి రాగానే జరిగిన విషయంపై  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ముగ్గురు నిందితులపై పోక్సో కేసు నమోదు చేసిన కొణిజర్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంజాయి మత్తులోనే నిందితులు అఘాయిత్యానికి ఒడిగట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కాగా... ఓ యువకుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.  ఈ అమానుష ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు