Telangana Panchayat Elections : ఓడిస్తున్నారని ఒకరు..ఓడించారని మరొకరు..సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన

తెలంగాణలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. కాగా ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు సాగుతున్నాయి. పలువురు అభ్యర్థులు గెలుపు ధీమాతో ఎంజాయ్ చేస్తుండగా, పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టినా ఓటమి పాలయ్యామని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

New Update
FotoJet (1)

Telangana Panchayat Elections

Big Breaking :తెలంగాణలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. పలు గ్రామాల్లో ఇప్పటికే ఓటర్లు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు అభ్యర్థులు గెలుపు ధీమాతో ఎంజాయ్ చేస్తుండగా, పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టినా ఓటమి పాలయ్యామని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే తమ ఓటమికి ఫలానా వారు కారణమంటూ నిరసనకు దిగుతున్నారు. ఇలాంటి చిత్ర విచిత్ర ఘటనలెన్నో పంచాయతీ ఎన్నికల్లో దర్శనమిస్తున్నాయి.

డబ్బులు పంచుతున్నారని..

మెదక్ జిల్లా...నార్సింగి మండల కేంద్రంలో శంకర్‌ నాయక్‌ అనే వ్యక్తి సెల్‌ టవర్‌ ఎక్కి ఆందోళనకు దిగాడు. శంకర్‌ నాయక్‌ నార్సింగ్‌ మండలంలోని నర్సంపల్లి పెద్ద తండా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాడు. అయితే తనను ఓడించేందుకు ప్రత్యర్థి ఓటుకు 2000 రూపాయలు పంపిణీ చేస్తున్నారని టవర్ పైకి ఎక్కి నిరసన తెలుపుతున్నాడు. గతంలో తాను సర్పంచ్‌గా పోటీ చేశానని, అయితే అప్పుడు కూడా తనను ఓడించడానికి పలువురు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. దీంతో తాను ఓడిపోయానని వాపోయాడు. ఈసారి కూడా డబ్బులు పంచి తనను గెలవకుండా చేస్తున్నాడని ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా టవర్ పైకి ఎక్కి నిరసన తెలుపుతున్నాడు నర్సంపల్లి పెద్ద తండా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న శంకర్ నాయక్.దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా స్పాట్‌కు చేరుకుని అభ్యర్థిని బుజ్జగించి కిందకు దించే ప్రయత్నం చేశారు.  

భార్య ఓటమి పాలయిందని

తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.  ఓడిన అభ్యర్థులు తమ ఓటమిని జీర్ణించుకోలేపోతున్నారు. ఖమ్మం జిల్లాలో ఓ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి భర్త తన ఓటమిపై వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ఊరి కోసం ఏ పని ఉన్నా చేశాను.. ఆపద వస్తే ముందు ఉన్నాను. ఎంతో ఖర్చు చేశాను.. చివరకు పంచాయతీ ఎన్నికల్లో ఓడించారు.. న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. కొన్ని గంటల పాటు హైడ్రామా.. ఉత్కంఠ మధ్య చివరకు ఆందోళన విరమించాడు. రఘునాథపాలెం మండలం హర్యా తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.  హర్యా తండా నుంచి సర్పంచ్ అభ్యర్థిగా మాలోతు చింతామణి అనే మహిళ పోటీ చేసింది. ఎన్నికల్లో ఆమె ఓడిపోయింది. ఎన్నికల్లో నేను ఓటర్లకు డబ్బులు పంచాను.. ఓడిపోయాను కాబట్టి నేను ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలంటూ సెల్ టవర్ ఎక్కాడు అభ్యర్థి భర్త రంగా. ఓటర్లను పంచిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే.. సెల్ టవర్ పైనుంచి దూకి చస్తానంటూ బెదిరించాడు. చివరికి పోలీసుల జోక్యంతో కథ సుఖాంతమైంది.
 
తల్లి ప్రేమను చూపిన కానిస్టేబుల్

సంగారెడ్డి జిల్లాలో గ్రామ సర్పంచ్‌ ఎన్నికల ఓటింగ్‌ కొనసాగుతోంది. కాగా రెండవ విడత ఎన్నికల్లో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఓటర్లు ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.కాగా స్థానికంగా ఓ పోలింగ్‌ కేంద్రానికి ఓ తల్లి చంటి పాపతో ఓటేయడానికి వచ్చింది. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి తల్లి వెళ్లడంతో అక్కడే విధులు నిర్వహిస్తన్న మమిళా కానిస్టేబుల్‌ పాపని కాసేపు లాలించింది. ఎన్నికల్లో పోలీస్ కర్తవ్యంతో పాటు తల్లి ప్రేమను చూపిన కానిస్టేబుల్ ను పలువురు అభినందించారు.

Advertisment
తాజా కథనాలు