/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
Crime
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రూ.లక్ష సుపారీ ఇచ్చి మరీ కట్టుకున్న భర్తను చంపేసిందో భార్య. అతికిరాతకంగా చంపించి ఎన్ఎస్పీ కాల్వలో పడేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏదులాపురం మున్సిపాలిటీ ముత్తగూడెం గ్రామానికి చెందిన బుర శ్రీనివాసరావు అనే వ్యక్తి... ఖమ్మం నగరంలో ఓ స్వీట్ షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు.
అయితే శ్రీనివాసరావు భార్యకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడగా.. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది కాస్త శ్రీనివాసరావుకు తెలియడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి ఉండటానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను చంపించేందుకు ప్లాన్ వేసింది. శ్రీనివాసరావు నవంబర్ 6న సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కారులో అతడిని ఎక్కించుకున్నారు.
భార్య అతితెలివిగా భర్త ఇంటికి రాలేదంటూ
అనంతరం హత్యచేసి గ్రామ శివారులో ఉన్న ఎన్ఎస్పీ కాల్వలో పడేశారు. అనంతరం శ్రీనివాసరావు భార్య అతితెలివిగా భర్త ఇంటికి రాలేదంటూ బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే శ్రీనివాసరావు చెప్పులు, బట్టలు కాల్వ వద్ద ఉండడంతో పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం శ్రీనివాసరావు డెడ్ బాడీ ఎన్ఎస్పీ కాల్వలో తేలింది. పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టానికి తరలించారు.
మృతుడి భార్యపై అనుమానం రావడంతో పోలీసులు ఆమెపై నిఘా పెట్టారు. ఆ అనుమానమే నిజం కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. దీంతో శ్రీనివాసరావు భార్యతో పాటుగా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూరల్ సీఐ రాజు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
Follow Us