Khammam : రూ.240 కోట్ల జాక్‌పాట్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు!

అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది.. ఆ అదృష్టం వచ్చినప్పుడు దెబ్బకు లైఫ్ సెట్ అయిపోతుంది. అలాంటి అదృష్టం ఖమ్మం  జిల్లా వాసికి దక్కింది. తన తల్లి పుట్టిన రోజు తేదీ సంఖ్యతో తీసుకున్న లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.240 కోట్లు సొంతం చేసుకున్నాడు.

New Update
khammam

అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది.. ఆ అదృష్టం వచ్చినప్పుడు దెబ్బకు లైఫ్ సెట్ అయిపోతుంది. అలాంటి అదృష్టం ఖమ్మం  జిల్లా వాసికి దక్కింది. అది అలాంటి ఇలాంటి అదృష్టం కాదు..  తన తల్లి పుట్టిన రోజు తేదీ సంఖ్యతో తీసుకున్న లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.240 కోట్లు సొంతం చేసుకున్నాడు.  ఈ అదృష్టంతో పేదరికంలో ఉన్న ఆ కుటుంబాన్ని లాటరీ ఒక్కసారిగా ధనికులను చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే..   బోళ్ల మాధవరావు, భూలక్ష్మిల కొడుకు అనిల్‌కుమార్‌ కు ఈ  అదృష్టం వరించింది. ఇటీవల యూఏఈలో తీసిన లాటరీలో రూ.240కోట్లు దక్కాయి. 

తల్లి పుట్టినరోజుతో 

ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన బోళ్ల అనిల్‌కుమార్‌ ప్రాథమిక విద్య అనంతరం చదువును హైదరాబాద్‌లో కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం యూఏఈలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కొంత కాలంగా లాటరీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటీవల తాను కొన్న టికెట్లలో తన తల్లి పుట్టినరోజుతో కూడిన ఓ లాటరీ నంబర్‌కు జాక్‌పాట్‌ తగిలింది. ఏకంగా రూ.  240కోట్లు దక్కాయి. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో దెబ్బకు అతని జీవితం సెటిల్ అయింది. అదృష్టమంటే ఇలా ఉండాలంటూ పలువురు అతని గురించి  చర్చించుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు