Gummadi Narsaiah: ప్రజల మనిషి.. గుమ్మడి నర్సయ్య బయోపిక్‌ ప్రారంభోత్సవం..

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్‌ సినిమా త్వరలో రానుంది. ఈ క్రమంలోనే శనివారం పాల్వంచలో ఆయన బయోపిక్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

New Update
Gummadi Narsaiah Bio Pic Launch Ceremony in palvancha

Gummadi Narsaiah Bio Pic Launch Ceremony in palvancha

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య(Gummadi Narasaiah) గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన గడుపుతున్న సాధారణ జీవితం ఎందరికో ఆదర్శం. అలాంటి ఆయనపై బయోపిక్‌ సినిమా రానుంది. ఈ క్రమంలోనే శనివారం పాల్వంచలో గుమ్మడి నర్సయ్య బయోపిక్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్త షాట్‌కు కెమెరా స్విచ్‌ ఆన్ చేశారు. 

ఈ చిత్రానికి పరమేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య పాత్రలో కన్నడ సూపర్‌ స్టార్ శివరాజ్‌కుమార్ నటిస్తున్నారు. నల్లా సురేష్ రెడ్డి (ప్రవళిక ఆర్ట్స్) ఈ సినిమాకు నిర్మాత. ఈ కార్యక్రమలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గమ్మడి నర్సయ్యను ప్రజల మనిషి, పేదవారి దేవుడు అంటూ కొనియాడారు. ఎమ్మెల్యే జీతం, ఆస్తులను దానం చేయడం, సైకిల్‌ను వాడటం నర్సయ్య నిరాడంబరతకు నిదర్శనమన్నారు. ప్రతి ఎమ్మెల్యేతో పాటు సర్పచ్‌ నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ ఆయన జీవిత చరిత్రను చూడాలన్నారు. 

Also Read: భగవద్గీత, అస్సాం టీ, వెండి గుర్రం.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన విలువైన బహుమతులు ఇవే !

Gummadi Narsaiah Bio Pic Launch Ceremony

ఈ సినిమా ద్వారా ప్రజాప్రతినిధులలో మార్పు వచ్చి అవినీతి తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ సినిమాకు సబ్సిడీ ఇప్పించేందుకు సీఎంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుమ్మడి నర్సయ్య మన తెలంగాణ బిడ్డ అని తలుచుకుంటేనే హృదయం సంతోషంతో ఉప్పొంగుతోందని అన్నారు. ఆయన బయోపిక్‌ను అయిదు భాషల్లో రిలీజ్ చేయడం వల్ల అందరికీ తెలంగాణ వాళ్ల గొప్పతనం తెలుస్తుందని పేర్కొన్నారు. 

మరోవైపు గుమ్మడి నర్సయ్య సినిమా కోసం తాను తెలుగు నేర్చుకుంటానని.. సొంతగా డబ్బింగ్ కూడా చెబుతానని శివరాజ్‌కుమార్ అన్నారు. ఈ సినిమాలో నటిస్తున్నందకు చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం గమ్మడి నర్సయ్య ఇంటికి వెళ్లాలని.. వాళ్ల కుటుంబ సభ్యులను కలిసినప్పుడు నా సొంత మనుషులను కలిసినట్లు అనిపించిందని తెలిపారు. నర్సయ్యను చూస్తుంటే మా నాన్నను చూసినట్లు అనిపిస్తోందని తెలిపారు.  అలాగే రాజకీయాల్లోకి రావాలనుకునే యువత కచ్చితంగా ఈ చిత్రాన్ని చూడాలన్నారు. 

Also Read: పుతిన్‌కి చేతికి మొసలి తోలు గడియారం; ధర వింటే షాక్ అవుతారు

Advertisment
తాజా కథనాలు