Kantara Chapter 1: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న 'కాంతార చాప్టర్ '1: రూ. 400 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ!

రిషబ్ శెట్టి 'కాంతార: చాప్టర్ 1' 6 రోజుల్లో రూ. 427.5 కోట్ల గ్రాస్ కలెక్షన్‌తో రూ. 400 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కాంతార మొదటి భాగాన్ని దాటి, సాండల్‌వుడ్‌లో రెండవ అత్యధిక వసూళ్ల చిత్రం గా నిలిచింది. సినిమా త్వరలో రూ. 500 కోట్ల మార్క్‌ను చేరనుంది.

New Update
Kantara Chapter 1

Kantara Chapter 1

Kantara Chapter 1: పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో విడుదలైన రిషబ్ శెట్టి లేటెస్ట్ మూవీ ‘కాంతార: చాప్టర్ 1’ సంచలన విజయం సాధిస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా తొలి వారాంతంలోనే స్ట్రాంగ్ ఓపెనింగ్ సాధించగా, వారం మధ్యలో కూడా అదే జోరును కొనసాగిస్తోంది. ముఖ్యంగా కన్నడ, హిందీ వెర్షన్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..

6 రోజుల్లోనే రూ. 427.5 కోట్లు గ్రాస్ కలెక్షన్ (Kantara Chapter 1 Box Office Collection)

తాజాగా మేకర్స్ విడుదల చేసిన అఫీషియల్ అప్‌డేట్ ప్రకారం, 'కాంతార: చాప్టర్ 1' ఇప్పటి వరకు మొత్తం రూ. 427.5 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించింది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇప్పుడు సినిమా రూ. 500 కోట్ల మార్క్ వైపు అడుగులు వేస్తోంది.

Also Read: పవన్ సినిమాలో విలన్‌గా మల్లా రెడ్డి.. ట్విస్ట్ ఏంటంటే..?

కాంతార మొదటి భాగాన్ని కూడా దాటి..

రిషబ్ శెట్టి గతంలో తెరకెక్కించిన 'కాంతార' చిత్రం ఎంతటి సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు 'చాప్టర్ 1' ఆ సినిమా లైఫ్‌టైం కలెక్షన్లను సైతం అధిగమించింది. ఈ సినిమాతో రిషబ్ శెట్టి తన రేంజ్‌ని మరోసారి నిరూపించుకున్నాడు. ఇది ప్రస్తుతం సాండల్‌వుడ్‌లో ఆల్‌టైం సెకండ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. 

Also Read: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!

స్టార్ కాస్ట్, టెక్నికల్ టీమ్

ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. రుక్మిణి వసంత కథానాయికగా నటించగా, గుల్షన్ దేవయ్య విలన్ పాత్రలో కనిపించారు. అలాగే ప్రముఖ నటుడు జయరామ్ ఓ ముఖ్యమైన పాత్రలో మెరిశారు. సినిమాకి సంగీతాన్ని అజనీష్ లోకనాథ్ అందించారు.

Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!

ఈ సినిమా విజయం వెనుక రిషబ్ శెట్టి విజన్, కథా నిర్మాణం, బలమైన భావోద్వేగాలు, అద్భుతమైన టెక్నికల్ వర్క్ ఉన్నాయి. ప్రత్యేకంగా, హిందీ వెర్షన్‌కు కూడా మంచి ఆదరణ లభించడం గమనించాల్సిన విషయం.

ప్రస్తుతం కలెక్షన్ల పరంగా చూస్తే, 'కాంతార: చాప్టర్ 1' త్వరలోనే రూ. 500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మరో భారీ మైలురాయిని చేరుకుంటుందేమో చూడాలి.

Advertisment
తాజా కథనాలు