/rtv/media/media_files/2025/10/26/kantara-chapter-1-2025-10-26-06-53-55.jpg)
Kantara Chapter 1
Kantara Chapter 1: థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌గా టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ కన్నడ నటుడు-దర్శకుడు Rishab Shetty రూపొందించారు. దర్శకుడిగా, ప్రధాన పాత్రలోనూ ఆయనే నటించారు. అయితే తాజాగా ఈ మూవీ సరికొత్త కొత్త రికార్డు సృష్టిచింది.
Also Read: కారుతో గుద్ది పరార్.. బిగ్ బాస్ నటి పై పోలీస్ కేసు!
మొదటగా, ఈ చిత్రం భారతీయ సినిమాల్లో ఈ సంవత్సరంలో అత్యధిక గ్రాస్ పొందిన సినిమాగా నిలిచింది. ఇప్పటికే రూ. 828 కోట్ల పైగా వసూళ్లను నమోదు చేసింది. కన్నడలో ఈ సినిమా భారీ బాక్సాఫీసు హిట్ గా నిలిచింది. కమర్షియల్ గాను టాక్ పరంగాను ఈ సినిమా దూసుకెళ్తోంది.
Also Read: బాహుబలి: ది ఎపిక్ కు కళ్లు చెదిరేలా హైదరాబాద్ బుకింగ్స్..!
రూ. 250 కోట్ల క్లబ్‌లోకి..
కన్నడ రాష్ట్రంలో ఈ చిత్రం ఘన రికార్డు నమోదు చేసుకుంది. కన్నడలో రూ. 250 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన తొలి కన్నడ చిత్రంగా నిలిచింది. ఇది స్థానిక ప్రేక్షకులను ఆకట్టుకొని, భారీ కలెక్షన్స్ సాధించింది.
ఇక మరొక ముఖ్యమైన విషయమేమంటే, మహారాష్ట్రలో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధించింది. ఇప్పటికీ అక్కడి గ్రాస్ వసూళ్లు భారీగా ఉన్నాయి. గతంలో Pushpa 2: The Rule మహారాష్ట్రలో రూ. 256 కోట్ల గ్రాస్ చేసింది. కాని ఈ సినిమా దాని రికార్డును బ్రేక్ చేసి కొత్త రికార్డును సృష్టిచింది. ఈ మూవీని Hombale Films నిర్మించగా, యువ బ్యూటీ Rukmini Vasanth ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు. సంగీతం Ajaneesh Loknath నే అందించారు.
మొత్తానికి, Kantara: Chapter 1 కథా, డైలాగ్‌లు, సంగీతం అన్నీ ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంది. సినిమాకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ తో జనాలు థియేటర్లకు భారీగా వెళ్తుండడం విశేషం. వసూళ్లు రోజు రోజుకూ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో, ఇతర భాషల్లో కూడా ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యిందని చెప్పొచ్చు.
Follow Us