Kantara Chapter 1: కాంతారా' టికెట్ హైక్‌పై మండిపడుతున్న నెటిజన్లు.. ఏపీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం!

'కాంతారా'  బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కన్నడ స్టార్ రిషబ్ శెట్టి.. ఇప్పుడు దాని ప్రీక్వెల్  'కాంతారా: చాప్టర్ 1' తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

New Update

Kantara Chapter 1: 'కాంతారా'  బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కన్నడ స్టార్ రిషబ్ శెట్టి.. ఇప్పుడు దాని ప్రీక్వెల్  'కాంతారా: చాప్టర్ 1' తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కన్నడలో ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ విడుదలవుతుండగా..   తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు  తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపునకు అనుమతి కోరగా.. అందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపునపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. 

టికెట్ రేట్ల పెంపు పై అభ్యంతరాలు 

అయితే ఏపీలో  'కాంతారా' సినిమా టికెట్ రేట్లు పెంచడంపై తెలుగు సినీ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు సినిమాలు కర్ణాటకలో విడుదలైనప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని! తెలుగు సినిమాల  టికెట్ ధరలు విషయంలో అక్కడి ప్రభుత్వం  సానుకూలంగా ఉండడంలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి సినిమాలకు ఏపీలో టికెట్ పెంచటంపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని సినీ వర్గాలు కోరాయి.

దీనిపై ఓ నెటిజన్ కూడా స్పందిస్తూ..'' ఒక డబ్బింగ్ సినిమాకి టికెట్ రేట్లు పెంచడం ఏంటీ సార్? 'కాంతారా'  కన్నడ నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయిన సినిమా.. దీనికి కూడా తెలుగు సినిమాల మాదిరిగానే రేట్లు పెంచడం సరికాదు. ఇలా చేయడం వల్ల ఫ్యామిలీస్ తో సినిమాలు చూడలేకపోతున్నాం.  ఇది భారీ బడ్జెట్ చిత్రం అయినప్పటికీ.. మన సినిమా కాదు అలాంటప్పుడు ఇక్కడ రేట్లు ఎందుకు పెంచాలి?'' అంటూ విమర్శిస్తున్నారు. అధిక ధరలు ఎక్కువ మంది సినిమాను చూసే అవకాశాన్ని దూరం చేస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. 

ఏపీ ప్రభుత్వం సానుకూల స్పందన

ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం స్పందిస్తూ.. కర్ణాటకలోని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని.. ఆ సినిమాలు ఇక్కడ ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని, పెద్ద మనసుతో ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..  సినిమాటోగ్రఫీ, హోం శాఖా అధికారులకు స్పష్టం చేశారు. రిషబ్ శెట్టి  'కాంతారా చాప్టర్-1' టికెట్ ధరలకు అనుమతివ్వాలని  ఆదేశించారు. కళ అనేది మనసుల్ని హత్తుకొని మనుషులను కలిపేది.. అంతేకానీ ప్రాంతాల పేరుతో దూరం చేసేది కాదు. సినిమా అనేది భిన్న కళల సమాహారం.. కావున పర భాష చిత్రం అనే పేరుతో వేరుగా చూడాల్సిన అవసరం లేదు అంటూ  'కాంతారా' సినిమా విషయంలో సానుకూలంగా స్పందించింది ఏపీ ప్రభుత్వం. 

Advertisment
తాజా కథనాలు