/rtv/media/media_files/2025/10/28/kantara-chapter-1-2025-10-28-20-00-49.jpg)
Kantara Chapter 1
Kantara Chapter 1: ఇటీవలే థియేటర్స్ లో విడుదలైన రిషబ్ శెట్టి 'కాంతారా చాప్టర్ 1' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది విడుదలైన భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లను కలెక్ట్ చేసిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 828 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ముఖ్యంగా కన్నడలో భారీ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. కన్నడ రాష్ట్రంలో ఈ ఏడాది రూ. 250 కోట్ల క్లబ్ లో చేరిన తొలి చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకొని.. ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.
#KantaraChapter1 will be streaming
— OTT Gate (@OTTGate) October 28, 2025
on Amazon Prime, Oct 31st.
In Kannada, Telugu, Tamil, Malayalam. pic.twitter.com/uINWVF1kdX
ఇప్పుడు ఓటీటీలో
అక్టోబర్ 31 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ప్లాట్ ఫార్మ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమా హక్కులను ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించారు. హీరోగా, దర్శకుడిగా మరోసారి సత్తా చాటారు రిషబ్. 2022లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న 'కాంతారా' ఫ్రీక్వెల్ గా 'కాంతారా చాప్టర్ 1' తెరకెక్కించారు. ఇందులో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించగా.. గుల్షన్ దేవయ్య, జయరామ్, ప్రమోద్ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: The Family Man 3: 'ది ఫ్యామిలీ మ్యాన్' మళ్ళీ వచ్చేస్తున్నాడు.. సీజన్ 3 లో సామ్ రోల్ ఇదేనా
Follow Us