/rtv/media/media_files/2025/09/27/kantara-chapter-1-2025-09-27-16-35-12.jpg)
Kantara Chapter 1
Kantara Chapter 1: పాన్ ఇండియా మూవీగా రూపొందిన సాండల్‌వుడ్ స్టార్ రిషబ్ శెట్టి(Rishab Shetty) తాజా చిత్రం కాంతార: చాప్టర్ 1 విడుదలకు సిద్ధమవుతోంది. గతంలో విడుదలైన కాంతారా సినిమా విశేషమైన ప్రజాదరణ పొందింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
ఈ సినిమాకు రిషబ్ శెట్టి నటుడు మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా పని చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా ప్రియులకు హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ద్వారా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ ఈవెంట్‌కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై రిషబ్‌ను, సినిమాను ప్రశంసించారు.
తెలుగు భాషలో మాత్రమే టికెట్ బుకింగ్ ఇంకా మొదలవలేదు. కారణం టికెట్ ధరలపై నిర్మాతలు ఇంకా స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. మిగతా అన్ని భాషల్లో ముందస్తుగా బుకింగ్స్ మొదలయ్యాయి.
#KantaraALegendChapter1#Canada#Toronto 🔥
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 25, 2025
Bookings kick-started at the iconic TIFF Bell Lightbox Theatre
Bookings link: https://t.co/EWJaFcaazZ
North America Bookings:https://t.co/PynFYwo0TYpic.twitter.com/AQd9YB3JFl
Also Read: తెలుగులో మాట్లాడు..? కాంతార హీరోపై నెటిజన్స్ ఫైర్
బ్రేక్ ఈవెన్ టార్గెట్ $9 మిలియన్లు.. (Kantara Chapter 1 Break Even Target)
ఈ సినిమా విదేశాల్లో భారీ టార్గెట్‌ను సెట్ చేసుకుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో కాంతార: చాప్టర్ 1కు బ్రేక్ ఈవెన్ టార్గెట్ $9 మిలియన్లుగా ఉంది. ఇది సాండల్‌వుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ చిత్రానికీ లేని రికార్డు టార్గెట్‌గా చెప్పొచ్చు. ఈ టార్గెట్ సాధిస్తే, కాంతార చిత్రం కన్నడ సినిమా స్థాయిని అంతర్జాతీయంగా మరో లెవెల్‌కి తీసుకెళ్తుంది.
ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. సినిమాకు సంగీతాన్ని అజనీష్ లోక్‌నాథ్ అందించారు. హోంబలే ఫిలింస్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.
Also Read: అక్కడ రికార్డు బ్రేక్.. దుమ్ము రేపుతోన్న 'మిరాయ్' కలెక్షన్స్
గ్రామీణ నేపథ్యం, పౌరాణిక అంశాలు, భక్తి భావం కలగలిపిన ఈ కథ, ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేయనుందని అంచనాలు ఉన్నాయి. భారతీయ మూలాలను, విశ్వాసాలను తెరపై బలంగా చూపించే ప్రయత్నంగా ఈ సినిమా కనిపిస్తోంది.
మొత్తానికి, కాంతార: చాప్టర్ 1 విడుదలకు ముందు నుంచే దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి హైప్ తెచ్చుకుంది. వచ్చే అక్టోబర్ 2న ఈ సినిమా ఏమేరకు రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.