/rtv/media/media_files/2025/10/13/kantara-chapter-1-2025-10-13-09-45-28.jpg)
Kantara Chapter 1
Kantara Chapter 1: రిషబ్ శెట్టి(Rishab Shetty) దర్శకత్వం వహించిన “కాంతారా చాప్టర్ 1” సినిమాకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది. డివైన్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 655 కోట్లు వసూలు చేసి, మరోసారి హోంబలే ఫిలిమ్స్ స్టాండర్డ్‌ను నిరూపించింది.
Also Read: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!
11 days world wide collections
— Jayaprakash (@jayaprakashkus1) October 13, 2025
Massive🔥🔥🔥🔥🔥🔥#KantaraChapter1#Kantarapic.twitter.com/sGu0KeD5dk
Also Read: మాధురికి దువ్వాడ ఎలా పరిచయం.. అక్కడే ఇద్దరి మధ్య లేటు వయసులో ఘాటు ప్రేమ!
రుక్మిణి వసంత్ పాత్ర మెయిన్ హైలైట్
ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటించారు. ఆమె పాత్రలో ఉన్న క్లాస్ & మాస్ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ సినిమాకు కొత్త ఊపును తీసుకొచ్చింది. ఆమె గ్లామర్ ప్రెజెంటేషన్, వేసిన కాస్ట్యూమ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ మంచి ఫీడ్‌బ్యాక్ తెచ్చుకున్నాయి.
అజనీష్ లోకనాథ్ అందించిన నేపథ్య సంగీతం, విజువల్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. మ్యూజిక్ అనేది ఈ సినిమా డివైన్ టోన్ కు సరిపోయేలా బాగా వర్క్ అయ్యింది. ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్ద ప్లస్ అయింది. టెక్నికల్‌గా సినిమా టాప్ క్వాలిటీ స్టాండర్డ్‌లో ఉంది.
జయరాం, గుల్షన్ దేవయ్య, ప్రమోధ్ శెట్టి లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించి, కథకు బలాన్ని ఇచ్చారు. ఒక్కో పాత్రకి ప్రత్యేకత ఉండడం వల్ల, సినిమా మొత్తం ఎంగేజింగ్‌గా సాగింది.
Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..
రూ. 800 కోట్ల దిశగా... (Kantara Chapter 1 Collections)
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సినిమా థియేటర్ల రన్ పూర్తయ్యే సరికి రూ. 800 కోట్లు దాటే అవకాశం ఉంది. ఇది మరోసారి భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురానుంది.
Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్..!
డివైన్ కాన్సెప్ట్‌కు సూపర్ రెస్పాన్స్..
కాంతారా చాప్టర్ 1 ఓ విజువల్ స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్స్. ఇది ఒక మనిషి విశ్వాసం, నమ్మకాన్ని పరీక్షించేలా సాగుతుంది. కథ, దర్శకత్వం, నటన అన్నీ కలిపి ఒక గొప్ప అనుభూతిని ఇచ్చేలా ఉన్నాయి. డివైన్ థీమ్‌తో సినిమాలు ఇష్టపడే వారికి ఇది మిస్ అవ్వకూడని సినిమా.
కాంతారా చాప్టర్ 1 అంచనాలకు మించిన వసూళ్లు సాధిస్తూ, భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.