Hezbollah: ఇరాన్‌కు బిగ్ షాక్.. హ్యాండిచ్చిన హెజ్బొల్లా
ఇప్పటివరకు ఇరాన్‌కు మద్దతు పలికిన హెజ్బొల్లా ఉగ్రసంస్థ యూటర్న్ తీసుకుంది. ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగిన నేపథ్యంలో అటు ఇజ్రాయెల్‌పై గానీ, అమెరికా పైగానీ దాడులు చేయమని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు ఇరాన్‌కు మద్దతు పలికిన హెజ్బొల్లా ఉగ్రసంస్థ యూటర్న్ తీసుకుంది. ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగిన నేపథ్యంలో అటు ఇజ్రాయెల్‌పై గానీ, అమెరికా పైగానీ దాడులు చేయమని స్పష్టం చేసింది.
ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు అణ్వాయుధాలు సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ వాటి పేర్లు మాత్రం వెల్లడించలేదు.
నోబెల్ శాంతి పురస్కరానికి ట్రంప్ పేరును పాకిస్థాన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడాన్ని పాకిస్థాన్ తప్పుబట్టింది. ఇది ఏమాత్రం సమంజసం కాదని తేల్చిచెప్పింది.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై దేశాధినేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ప్రయత్నాలు చేయాలని మోదీ కోరారు.
ప్రస్తుతం టెహ్రాన్‌లోని కీలక అణుస్థావరాలపై అమెరికా దాడులు చేస్తుండటంతో ఖమేనీ భద్రత మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఆయన ఉండే ప్రదేశంలో ఎలాంటి సిగ్నళ్లు అందకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం.
ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులుందరూ అక్కడి భారత రాయబార కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకొని స్వదేశానికి రావాలని.. లేకపోతే జరిమానా లేదా జైలు శిక్ష ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వ ఖండించింది.
కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధులో భాగంగా మరో 310 మంది భారతీయులు ఇరాన్ నుంచి భారత్‌కు వచ్చారు. మొత్తం ఇప్పటిదాకా 827 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
ఇరాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్‌రియారీ హతమయ్యారు. ఈ విషయాన్ని IDF ప్రకటించింది.
ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. అయితే ఇరాన్ సీక్రెట్‌గా అణు పరీక్షలు నిర్వహించి ఉండొచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు. దీనివల్లే ఇది భూకంపానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.