Hezbollah: ఇరాన్‌కు బిగ్ షాక్.. హ్యాండిచ్చిన హెజ్‌బొల్లా

ఇప్పటివరకు ఇరాన్‌కు మద్దతు పలికిన హెజ్‌బొల్లా ఉగ్రసంస్థ యూటర్న్ తీసుకుంది. ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగిన నేపథ్యంలో అటు ఇజ్రాయెల్‌పై గానీ, అమెరికా పైగానీ దాడులు చేయమని స్పష్టం చేసింది.

New Update
Hezbollah says no plans to attack Israel or US after American strikes on Iran

Hezbollah says no plans to attack Israel or US after American strikes on Iran

Hezbollah: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటివరకు ఇరాన్‌కు మద్దతు పలికిన హెజ్‌బొల్లా ఉగ్రసంస్థ యూటర్న్ తీసుకుంది. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇరాన్‌కు సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు సిద్ధమని ఇటీవలే ప్రకటించింది. కానీ ఇప్పుడు మాట మార్చింది. ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగిన నేపథ్యంలో అటు ఇజ్రాయెల్‌పై గానీ, అమెరికా పైగానీ దాడులు చేయమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ అధికార ప్రతినిధి అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు.  
'' ఇరాన్‌ తనను తాను కాపాడుకోగలదు. అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి దాడి చేసినా కూడా వాటికి తగిన బుద్ధి చెప్పగలదు. కాల్పుల విమరణ ఒప్పందం జరగడానికి హెజ్‌బొల్లా కట్టుబడి ఉంది. ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడులు చేసేంత వరకు ఇజ్రాయెల్‌ భూభాగంపై మేము దాడులు చేయమని'' హెజ్‌బొల్లా అధికార ప్రతినిధి తేల్చిచెప్పారు. ఇదిలాఉండగా గతేడాది ఇజ్రాయెల్‌, హెజ్‌బొల్లా మధ్య కూడా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. 
హమాస్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీనికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్‌ హెజ్‌బొల్లాపై విరుచుకుపడింది. ఆ సంస్థకు చెందిన పలు స్థావరాలపై దాడులు చేసి ధ్వసం చేసింది. ఆ తర్వాత గతేడాదిలోనే నవంబర్‌లో ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విమరణ ఒప్పందం జరిగింది. ఆ సమయంలో అమెరికా మధ్యవర్తిత్వంతనే ఈ ఒప్పందం జరిగింది. అయితే ఇన్నాళ్లు ఇరాన్‌కు సపోర్ట్‌గా ఉన్న హెజ్‌బొల్లా తాజా పరిస్థితుల నేపథ్యంలో హ్యాండ్‌ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: ఛీ..ఛీ వీడు టీచరేనా.. క్లాస్‌లో గురకపెట్టి నిద్రపోతున్నాడు.. VIDEO

Advertisment
Advertisment
తాజా కథనాలు