Pakistan: ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు వ్యతిరేకంగా పాకిస్థాన్ సంచలన ప్రకటన

నోబెల్ శాంతి పురస్కరానికి ట్రంప్‌ పేరును పాకిస్థాన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడాన్ని పాకిస్థాన్ తప్పుబట్టింది. ఇది ఏమాత్రం సమంజసం కాదని తేల్చిచెప్పింది.

New Update
Pakistan condemns US strike on Iran

Pakistan condemns US strike on Iran

ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా దాడులకు దిగిన సంగతి తెలిసిందే. అయితే అగ్రరాజ్యం చేసిన దాడులను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల నోబెల్ శాంతి పురస్కరానికి ట్రంప్‌ను పాకిస్థాన్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడాన్ని పాకిస్థాన్ తప్పుబట్టింది. ఇది ఏమాత్రం సమంజసం కాదంటూ ఎక్స్‌లో పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

Also Read: సినిమాను తలపించే ఘటన.. రూ.11.39 కోట్ల విలువైన కొకైన్ క్యాప్సుల్స్‌ మింగిన నిందితుడు

ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రంప్‌కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేందుకు ఆయన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని నిర్ణయించామని పాక్‌ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఘర్షణలు ఆగేందుకు ట్రంప్ కృషి చేశారని.. ఇందుకోసం నోబెల్ శాంతి బహుమతికి ఆయన అర్హుడేనని స్పష్టం చేసింది. 4 రోజుల క్రితమే ట్రంప్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు వైట్‌హౌస్‌లో విందు ఇచ్చిన విషయం తెలిసిందే. 

Also Read: ఇరాన్‌పై అమెరికా దాడులు.. అత్యంత సురక్షిత బంకర్‌లోకి ఖమేనీ

ఆ సమయంలోనే ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అసిమ్ మునీర్ విజ్ఞప్తి చేశారు. అయితే శనివారమే పాక్ దీనిపై అధికారికంగా ప్రకటన చేసింది. భారత్‌-పాక్ మధ్య శాంతి కోసం ట్రంప్ కృషి చేశారని.. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాల మధ్య యుద్ధం రాకుండా నివారించారని ప్రశంసించింది. అంతేకాదు భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి ట్రంప్ చొరవే కారణమని తేల్చిచెప్పింది. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా కూడా ఎంటర్ అయ్యింది. ఇరాన్‌లోని అణు స్థావరాలపై దాడులు చేయడంతో పాకిస్థాన్‌ అమెరికా వైఖరిని తప్పుబట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: అమెరికా దాడులకు మూల్యం చెల్లించుకోవాల్సిందే.. ఇరాన్ మంత్రి వార్నింగ్

Advertisment
తాజా కథనాలు