Ali Khamenei: ఇరాన్‌పై అమెరికా దాడులు.. అత్యంత సురక్షిత బంకర్‌లోకి ఖమేనీ

ప్రస్తుతం టెహ్రాన్‌లోని కీలక అణుస్థావరాలపై అమెరికా దాడులు చేస్తుండటంతో ఖమేనీ భద్రత మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఆయన ఉండే ప్రదేశంలో ఎలాంటి సిగ్నళ్లు అందకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌లను పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం.

New Update
Supreme Leader of Iran Ali Khamenei

Supreme Leader of Iran Ali Khamenei

Ali Khamenei: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ బంకర్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో కొన్ని బంకర్లలో ఆశ్రయం కీలక కమాండర్లు మృతి చెందారు. అయితే ప్రస్తుతం టెహ్రాన్‌లోని కీలక అణుస్థావరాలపై అమెరికా దాడులు చేస్తుండటంతో ఖమేనీ భద్రత మరింత పెరిగినట్లు సమాచారం.  

Also Read: ఇజ్రాయెల్‌ దాడుల్లో ముగ్గురు కీలక ఐఆర్‌జీసీ కమాండర్ల మృతి

ఆయన ఉండే ప్రదేశంలో ఎలాంటి సిగ్నళ్లు అందకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌లను పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఖమేనీ భారీ భద్రత నడుమ అత్యంత సురక్షితమైన బంకర్‌లో ఆయన ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఖమేనీకి అత్యంత సన్నిహితులైన ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఇరాన్ ప్రతిదాడుల గురించి ఆయనతో చర్చిస్తున్నట్లు సమాచారం.   

Also Read: అమెరికా దాడులకు మూల్యం చెల్లించుకోవాల్సిందే.. ఇరాన్ మంత్రి వార్నింగ్

మరోవైపు యుద్ధ పరిస్థితులు తీవ్రతరమవుతున్న క్రమంలో ఖమేనీ.. తన వారసులుగా ముగ్గురిని ఎంపిక చేసినట్లు న్యూయార్క్ టైమ్స్‌ తమ కథనంలో వెల్లడించింది. IRGCలో కీలక పదవులకు నియమించాల్సిన కమాండర్ల పేర్లు కూడా ఖమేనీ ప్రకటించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇరాన్‌లో కొత్త సుప్రీం లీడర్‌ను నియమించే ప్రక్రియ సున్నితంగా, కష్టతరంగా ఉంటుంది. నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే సుప్రీం నేత ప్రతిపాదించిన పేర్లు ఇరాన్‌లోని మతాధికారులు పరిశీలించి ఎంపిక చేస్తారు. అయితే ఖమేనీ ఎంపిక చేసిన వారిలో ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ ఉన్నట్లు వస్తున్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు.

Also Read: బీరు తాగినా.. గ్లాస్ సీసాలో ఏది తాగినా మీ పని ఖతం

 

Advertisment
Advertisment
తాజా కథనాలు