/rtv/media/media_files/2025/06/21/indian-workers-in-israel-2025-06-21-21-27-11.jpg)
Indian Workers In Israel Being Forced To Return? What Government Said
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు పేరుతో ఇరాన్‌లోని భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఉన్న భారతీయులుందరూ అక్కడి భారత రాయబార కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకొని స్వదేశానికి రావాలని.. లేకపోతే జరిమానా లేదా జైలు శిక్ష ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది. తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
Also Read: పదిహేనేళ్ల సంసారంలో ఊహించని ట్విస్ట్ ! చంపుతుందనే భయంతో లవర్ తో భార్యకు పెళ్లి!
సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఖండించింది. ఆ సమాచారం నిజం కాదని.. ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మోద్దని తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్‌లో భారత పౌరుల పేర్ల నమోదు అనేది సంక్షోభ సమయంలో మాత్రమే వీలు ఉంటుందని అక్కడున్న భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. అలాగే భారత ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు, సౌకర్యాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుందని పేర్కొంది. సరైన సమాచారం కోసం ఎంబసీ అధికారిక అప్‌డేట్స్‌పై ఆధారపడాలని సూచనలు చేసింది.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
ఇదిలాఉండగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం ఆపరేషన్ సింధు పేరుతో ఇరాన్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో 310 మంది భారతీయులు ఇరాన్ నుంచి భారత్‌కు వచ్చారు. మొత్తం ఇప్పటిదాకా 827 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అవసరాన్ని బట్టి ఈ ఆపరేషన్ కొనసాగుతుందని.. ఇరాన్‌లో ఉన్న ప్రతి పౌరుడికి సాయం అందిస్తామని స్పష్టం చేసింది.
Also Read: సంచలన అప్‌డేట్.. ఇరాన్‌లో భూకంపం రావడానికి కారణం అదే !
 Follow Us