/rtv/media/media_files/2025/07/19/kim-jong-un-2025-07-19-19-11-43.jpg)
kim jong un
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంత పాలన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఆంక్షలతో ఆ దేశ ప్రజలు రోజులు వెల్లదీస్తుంటారు. అయితే తాజాగా కిమ్‌కు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఆయన బరువును తగ్గించే ఔషధాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఔషధాలను కూడా తన లాంటి శరీరత్వం ఉన్న వ్యక్తులపైనే ప్రయోగించి ఆ తర్వాతే తీసుకోవాలని భావిస్తున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
Also Read : శ్రావణంలో శివపూజ అనంతరం 3 సార్లు చప్పట్లు ఎందుకు కొట్టాలి? ఆంతర్యం ఇదే!
Kim Jong Un Concentrate On Weight Loss Drugs
ఇక వివరాల్లోకి వెళ్తే అమెరికాకు చెందిన ఓ పత్రిక గతంలో కిమ్.. మద్యానికి, సిగరెట్లకు బానిసైపోయినట్లు రాసుకొచ్చింది. దీనివల్ల ఆయన నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొంది. దీనివల్ల ఆయన 140 కేజీల వరకు బరువు పెరిగి ఉండొచ్చని తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన బరువు తగ్గాలనుకోవడం గురించి రాసుకొచ్చింది. దీనికోసం కిమ్.. ఏం చేసేందుకైనా, ఎంతటి ఖర్చుకైనా వెనకాడటం లేదని పేర్కొంది.
Also Read: 'ఉరిశిక్ష రద్దు.. నిమిష ప్రియ విడుదల!'
కిమ్ జోంగ్ ఉన్.. తన ఊబకాయం తగ్గించి సన్నగా మార్చేందుకు విదేశాల్లో ఔషధాలు ఎక్కడున్నాయో వెతకాలని ఆయన సన్నిహితులను ఆదేశించినట్లు చెప్పింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆయన ఈ ఔషధాన్ని నేరుగా వాడరు. ఆయన లాగే శరీరాకృతి, మెడికల్ హిస్టరీ ఉన్నటువంటి వ్యక్తులపై ముందుగా ప్రయోగించనున్నట్లు తెలిపింది. అంతేకాదు గతంలో కిమ్ తండ్రి కూడా నొప్పిని నివారించేందుకు తన సహాయకులకే ముందుగా ఇంజెక్ట్ చేసేవారని సమాచారం.
Also Read : మేడ్చల్‌లో దారుణం..స్కూల్ టీచర్ ఆత్మహత్య
ఇదిలాఉండగా కిమ్ అయిదడుగుల ఆరంగుళాలు ఉంటారు. అయితే 2021లో ఆయన బరువు తగ్గిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ బరువు పెరిగారు. ఆయనకు మధుమేహం, హైబీపీ ఉందని, కీళ్ల సంబంధిత సమస్యలు కుడా ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ కార్యక్రమాల్లో కూడా కిమ్ ఎప్పుడూ కూర్చునే ఉంటారని.. ఎక్కువ దూరం కూడా నడవరని పలువురు నిపుణులు చెబుతున్నారు. గతంలో కిమ్ తాత, తండ్రి గుండె సంబంధిత సమస్యలతోనే చనిపోయారు.
Also read: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లెందుకు.. BCCIపై శివసేన ఎంపీ ఫైర్
rtv-news | telugu-news | international | kim jong un