/rtv/media/media_files/2025/07/14/high-speed-maglev-train-in-china-2025-07-14-15-20-03.jpg)
high-speed maglev train in China
గత కొన్నేళ్లుగా హైస్పీడ్ రైళ్లపై దృష్టి సారించిన చైనా.. తాజాగా మరో అద్భుతం సృష్టించింది. ఏకంగా విమానంతో పోటీ పడే సరికొత్త రైలు ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఈ రైలు గంటకు 600 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని తెలుస్తోంది. తాజాగా 17వ మోడ్రన్ రైల్వే ఎగ్జిబిషన్‌లో మాగ్లెవ్ రైలును చైనా ప్రదర్శించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. కేవలం 7 సెకండ్లలోనే ఇది 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని అధికారులు తెలిపారు.
ఈ రైలు అందుబాటులోకి వస్తే.. బీజింగ్ నుంచి షాంఘై మధ్య ఉండే 1200 కి.మీ దూరాన్ని కేవలం 2.30 గంటల్లో చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి 5.30 గంటల సమయం పడుతోంది. మ్యాగ్నెటిక్ లివిటేషన్ (మాగ్లెవ్) టెక్నాలజీ సాయంతో ఈ రైలు అత్యధికంగా వేగంతో దూసుకెళ్లగలదు. ఈ టెక్నాలజీ అయస్కాంత వ్యతిరేక క్షేత్రాలను ఉపయోగించి.. ట్రాక్ నుంచి రైలును పైకి లేపేందుకు సాయపడుతుంది.
Also Read : ఈ ఒక్క రసంతో కిడ్నీ రాళ్లు ఖతం!
High-Speed Maglev Train In China
Ever wondered what 600 km/h feels like on the ground? 🚄
— Chengdu China (@Chengdu_China) July 14, 2025
Hop on the world’s fastest train and get ready for an insane, mind-blowing ride.
This isn't sci-fi — it’s happening in China! 🇨🇳💨#FastestTrain#ChinaSpeed#Maglev#NextLevelTravel#FutureIsNow#HighSpeedRail#600kmh… pic.twitter.com/1Eq4Flm6U1
Also Read : తిరుపతిలో రైళ్లలో మంటలు.. రెండు భోగీలు పూర్తి దగ్ధం
దీంతో ఫ్రిక్షన్ తగ్గి రైలు నిశ్శబ్దంగా, వేగంగా వెళ్లగలుగుతుందని అధికారులు తెలిపారు. అయితే ఈ రైలు బరువు ఏకంగా 1.1 టన్నులుగా ఉండనుంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా చరిత్ర సృష్టించనుంది. ఇదిలాఉండగా ఈ ఏడాది జూన్‌లో చైనా ఇంజినీర్లు ఈ రైలును పరీక్షించారు. తాజాగా ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ రైలుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Also Read : నిమిష ప్రియను కాపాడలేం.. కేంద్రం సంచలన ప్రకటన
🇨🇳🚄China is redefining the world’s high-speed rail development.
— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) July 12, 2025
The 600km/h driverless high-speed maglev train debuts! pic.twitter.com/1VghGaC1DQ
Also Read : అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. కెమెరా సూపరెహే!
telugu-news | rtv-news | High Speed Trains | international