Singapore: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్..

ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్‌ నిలిచింది. ఇక రెండో స్థానంలో లండన్‌ ఉండగా.. హాంగ్‌ కాంగ్‌ మూడో స్థానానికి పరిమితమైంది. సింగపూర్‌ వరుసగా మూడోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోవడం మరో విశేషం. 

New Update
Singapore

Singapore

ప్రపంచంలో ఖరీదైన నగరాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉండాలన్నా, ఏ వస్తువు కొనుక్కోవాలన్న అన్నీ కూడా ధరలు ఎక్కువగా ఉంటాయి.  తాజాగా ఓ కీలక విషయం బయటపడింది. జూలియస్‌ బేర్‌ వార్షిక నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్‌ నిలిచింది. ఇక రెండో స్థానంలో లండన్‌ ఉండగా.. హాంగ్‌ కాంగ్‌ మూడో స్థానానికి పరిమితమైంది. సింగపూర్‌ వరుసగా మూడోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోవడం మరో విశేషం. 

Also read: షార్జాలో కేరళ తల్లీబిడ్డల మృతి...భర్త కుటుంబానికి బిగ్ షాక్‌

ఇక వివరాల్లోకి వెళ్తే.. కనీసం మిలియన్ డాలర్ల బ్యాంక్ బ్యాలెన్స్‌ ఉన్న వ్యక్తులు కొంటున్న వివిధ రకాల వస్తువులు, వారి జీవన వ్యయం ఆధారంగా జూలియస్‌ బేర్‌ లైఫ్‌స్టైల్‌ ఇండెక్స్‌ ఆయా నగరాలపై విశ్లేషించి రిపోర్ట్ తయారుచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి--మార్చి మధ్య డేటాను పరిగణలోకి తీసుకుంది. తాజాగా ఖరీదైన నగరాల జాబితాను వెల్లడించింది.  

Also Read :  భట్టికి బిగ్‌ షాక్‌..రూ.25 కోట్ల పరువు నష్టం దావా? బీజేపీ చీఫ్‌ నోటీసులు

టాప్‌ 10 ఖరీదైన నగరాలు 

1. సింగపూర్‌ 2. లండన్‌ 3. హాంగ్‌కాంగ్‌ 4. షాంఘై 5. మొనాకో 6. జ్యూరిచ్‌ 7. న్యూయార్క్‌ 8. పారిస్‌ 9. సావో పౌలో 10. మిలాన్‌.

Also Read :  రాహుల్‌ గాంధీకి బిగ్ రిలీఫ్.. బెయిల్‌ మంజూరు

సింగపూర్‌ మొదటి స్థానంలో ఎలా ?

సింగపూర్‌లో చూసుకుంటే ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉంటాయి. అంతేకాదు పలువురు ఇంటర్నేషనల్ వ్యాపారులు సింగపూర్‌ను కేంద్రంగా చేసుకొని తమ వ్యాపారాన్ని నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే గతంలో అక్కడి నుంచి వెళ్లిపోయిన వ్యాపారులను మళ్లీ వెనక్కి తీసుకొచ్చేందుకు సింగపూర్‌ కొన్ని సంస్కరణకు కూడా చేపట్టింది. ఈ క్రమంలోనే అక్కడ జీవన వ్యయం ఒక్కసారిగా పెరిగిపోయింది. అక్కడి ప్రజలు చాలావరకు బంగారు కొనేందుకే ఇష్టపడతారు. అందుకే సింగపూర్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలిచిందని ఈ రిపోర్టు పేర్కొంది. అలాగే స్థానికులు అక్కడ ఎక్కువగా ఆహారం, హెల్త్‌కేర్‌ వస్తువులు, బూట్లు, విద్యపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని జూలియస్ బేర్ రిపోర్ట్‌ వెల్లడించింది. 

Also Read: సంచలన అప్‌డేట్.. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా

london | singapure | rtv-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు