/rtv/media/media_files/2025/07/18/oman-changed-work-rule-2025-07-18-15-39-01.jpg)
oman changed work rule
మనదేశంలో చాలామంది బతుకుదేరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారన్న సంగతి తెలిసిందే. అందులో ఒమన్ కూడా ఒకటి. అయితే ఈ దేశంలోని తాజాగా వర్క్ రూల్స్‌లో మార్పులు తీసుకొచ్చారు. ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. పలు రంగాల్లో పనిచేసే ప్రొఫెషనల్స్ కచ్చితంగా సర్టిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒమన్ సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్ క్లాసిఫికేషన్ అనే సర్టిఫికేట్‌ను ఇంజినీర్లు తప్పకుండా సెక్టార్ స్కిల్ యూనిట్ ఆమోదంతో పొందాల్సి ఉంటుంది. వర్క్‌పర్మిట్ పునరుద్ధరించేందుకు ముందే దీన్ని తీసుకోవాలి.
Also Read: భారత అమ్ములపొదిలో మరో ఆయుధం..ఏకే 203...దీని ప్రత్యేకత ఏంటంటే?
Also Read : హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన! రోడ్లన్నీ జలమయయం
Oman Changed Work Rule And Certification
అలాగే సెప్టెంబర్ 1 నుంచి 20 రకాల అకౌంటింగ్, పైనాన్షియల్ డిపార్ట్‌మెంట్లలో పనిచేసేవాళ్లు కూడా తప్పకుండా ఇలాంటి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అసిస్టెంట్ ఇంటర్నల్ ఆడిటర్, ఇంటర్నల్ ఆడిటర్, కౌంట్స్ టెక్నిషియన్స్, అసిస్టెంట్ ఎక్స్‌టర్నల్ ఆడిటర్, ఎక్స్‌టర్నల్ ఆడిట్ మేనేజర్, ఇంటర్నల్ ఆడిట్ మేనేజర్ తదితర పోస్టులు ఉన్నాయి. అలాగే యజమానులు, విదేశీ ఉద్యోగులు సైతం వర్క్‌పర్మిట్ కోసం ఈ పోర్టల్ ద్వారా అప్లై చేయాల్సి చేయాలని అధికారులు తెలిపారు. సరైన క్రెడెన్షియల్స్ లేనివాళ్లకు వర్క్‌పర్మిట్ జారీ చేయడం దాన్ని పునరుద్ధరించడం అనేది జరగదు.
Also Read: మహారాష్ట్రలో మారుతున్న రాజకీయాలు.. బీజేపీలోకి ఉద్ధవ్ ఠాక్రే ?
గల్ఫ్ కోపరేషన్ కైన్సిల్‌లో ఉండే దేశాల్లో వర్కర్ల నైపుణ్యాలు పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాల్లో ఇలాంటి చర్యలనే అమలు చేస్తున్నారు. ఒమన్ కూడా ఇంజినీర్లతో పాటు అకౌంటెంట్ వృత్తి నిపుణులను కూడా సర్టిఫికేషన్‌తో లేబర్ మార్కెట్‌లో స్కిల్స్‌ను పెంచుతోంది. దీనికోసం సరైన డెడ్‌లైన్స్, డిజిటల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వంటి చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల యజమానులు కూడా దేశంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
Also Read : ఒమన్‌లో కొత్త వర్క్ రూల్.. ఆ పని అందరూ చేయాల్సిందే
international | work | oman | rtv-news | telugu-news