/rtv/media/media_files/2025/07/15/indian-techie-2025-07-15-19-09-27.jpg)
Indian Techie Living In Sweden Shares Reality Of Life Abroad, Faces Backlash
చాలామంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నారు. అక్కడే ఉద్యోగం చేయాలని కలలు కంటారు. కానీ విదేశాల్లో ఉండటం అంత ఈజీ కాదని ఐరాపాలో ఉంటున్న ఓ భారతీయ టెకీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. అధిక ధరల నుంచి ఒంటరితనం దాకా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని తన అనుభవాలను ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read: మీరు మనుషులేనారా ? ఇంటర్ విద్యార్థినిని రేప్ చేసిన లెక్చరర్లు
Indian Techie Living In Sweden Shares Reality Of Life
'' కొన్నేళ్ల నుంచి స్వీడన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాను. ఫారిన్‌లో ఉంటున్న వాళ్లదే మంచి జీవితం అనే ప్రచారం ఉంది. కానీ అది నిజం కాదు. ఇక్కడ జాబ్ పోతే వారం రోజుల్లోనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఏళ్ల తరబడి పనిచేసినా, ట్యాక్స్‌లు కట్టినా కూడా లెక్కలోకి రాదు. ఇక్కడుండే సిస్టమ్ ఉద్యోగంతోనే ముడిపడి ఉంటుంది. జీవన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వచ్చే శాలరీలో 30 నుంచి 50 శాతం నేరుగా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంటి అద్దె, సరకుల ధరల వల్ల నెలఖారు వచ్చేసరికి సేవింగ్స్ అనే మాటే ఉండదు.
Also Read: సోషల్ మీడియా పోస్టులపై సుప్రీం కీలక ఆదేశాలు..ఇక దబిడి దిబిడే...
ఇక్కడ భిన్నమైన వాతావరణం ఉంటుంది. వేసవి కాలంలో నాలుగు నెలల వరకు సూర్యుడు అస్తమించడు. ఇక చలికాలంలో నాలుగు నెలలు అంతా చీకటిగా ఉంటుంది. టెంపరేచర్ మైనస్ 15 డిగ్రీలకు పడిపోతుంది. దీంతో స్థానికులు సరకులు నిల్వ చేసుకుని నెలల తరబడి ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో ఒంటరితనం వెంటాడుతుంది. కుటుంబ, స్నేహితులతో మంచి అనుబంధం ఉండేవారు కాస్త ఆలోచించి విదేశాలకు రావాలి. ఇక్కడ అవసరం లేకుండా ఎవరూ కూడా ఫోన్ చేయరు. ఇష్టమైన ఫుడ్ ఏంటి అని కూడా అడగరు. భారత్‌లో పండగలు జరుగుతుంటే మనం ఫోన్‌లో ఫొటోలు చూసుకోవాల్సిందేనని'' దేవ్ విజయ్ వర్గీయ అనే భారతీయ టెకీ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
Also Read : సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం.. బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ
Also Read : యూట్యూబ్ చూసి 16 బుల్లెట్ బైక్‌లు చోరి.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్టు
telugu-news | rtv-news | sweden | international