Tomiko Itooka: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు మృతి..
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన టోమికో ఇతోకా (116) మరణించారు. డిసెంబర్ 29న అనారోగ్య సమస్యలతో ఆమె మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. జపాన్‌కు చెందిన ఇతోకా 1908, మే 23న జన్మించారు.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన టోమికో ఇతోకా (116) మరణించారు. డిసెంబర్ 29న అనారోగ్య సమస్యలతో ఆమె మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. జపాన్‌కు చెందిన ఇతోకా 1908, మే 23న జన్మించారు.
ఫేస్బుక్లో పరిచయమైన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు యూపీకి చెందిన బాదల్ బాబు పాకిస్థాన్‌కు వెళ్లాడు. అక్రమంగా పాక్‌లోకి ప్రవేశించిన అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ అమ్మాయిని కూడా విచారించగా తనకు అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పింది.
న్యూ ఆర్లీన్స్‌లో ఓ దుండగుడు వాహనంలో జనాలపై వేగంగా దూసుకొచ్చిన ఈ ఘటనలో 15 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ తాజాగా విడుదలయ్యాయి.నిందితుడు ఐసిస్ ఉగ్రవాది షంసుద్దీన్ జబ్బార్‌గా పోలీసులు భావిస్తున్నారు.
సౌత్ కొరియా విమాన ప్రమాదం వెనుక నార్త్ కొరియా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. గతంలో సౌత్ కొరియా విమానాలను నార్త్ కొరియా టార్గెట్ చేసిన సందర్భాలు ఉండటంతో ఈ అనుమానలు వ్యక్తం అవుతున్నాయి.
ద.కొరియాలో మరో విమానానికి పెను ప్రమాదం తప్పింది. గింపో ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య వచ్చింది. దీంతో పైలట్ మళ్లీ ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
చైనీస్ సీరీస్ 'హిడెన్ లవ్' ఫేమ్ నటి జావో లూసి ఇటీవలే ఆస్పత్రిలో చేరడంతో ఆమె ఆరోగ్యానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. జావో త్వరలోనే కోలుకుంటారని.. ప్రస్తుతం డాక్టర్ల సూచనలతో చికిత్స జరుగుతుందని తెలిపారు.
ఆఫ్గానిస్థాన్‌పై పాక్ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాక్ సరిహద్దు ప్రాంతంలోని కుర్రమ్పై ఆఫ్గానిస్థాన్ దాడులకు పాల్పడింది. ఈ ఎదురు కాల్పుల్లో 25 మంది పాక్ సైనికులు మృతి చెందగా.. మరో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే 2025లో మొత్తం నాలుగు గ్రహణాలు జరగనున్నాయి. ఇందులో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. అయితే వీటిలో ఒకటి మాత్రమే భారత్‌లో కనిపించనుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
దక్షిణ కొరియా సూపర్ ఏజ్డ్ సొసైటీగా మారినట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. ఆ దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు 65 ఏళ్లు పైబడిన వారే ఉండటం గమనార్హం. 2008లో అక్కడి వృద్ధ జనాభా 49 లక్షలు ఉండగా.. 2024 నాటికి అది రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది.