ఇంటర్నేషనల్ Brunei Prince: సామాన్యూరాలిని పెళ్లి చేసుకున్న బ్రూనై రాజకుమారుడు.. బ్రూనై దేశ రాజకుమారుడు అబ్దుల్ మతీన్ (32).. యంగ్ మాలియా అనిషా రోస్నా(29) అనే ఓ సామాన్య మహిళను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By B Aravind 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dreams: అద్భుతం.. ఈ పరికరంతో కలల్ని నియంత్రిచ్చుకోవచ్చు.. నిద్రలో వచ్చే కలల్ని నియంత్రించగలిగేలా అమెరికాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది. దీనివల్ల ఈ పరికరం ద్వారా మనకు వచ్చే కలల్ని ఆపడమే కాకుండా మనం ఎలాంటి కలలు కనాలి... కలల్లోనే జీవితానికి అవసరమైన నైపుణ్యాల గురించి తెలుసుకోవచ్చు. By B Aravind 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rotting Potato Gas: నలుగురు కుటుంబ సభ్యులను చంపేసిన ఆలుగడ్డలు.. ఆలుగడ్డలు ఓ కుటుంబంలో నలుగురి ప్రాణాలు తీశాయి. 8 ఏళ్ల చిన్నారిని అనాథగా చేశాయి. సెల్లార్లో నిల్వ ఉంచిన ఆలుగడ్డలు కుళ్లిపోయి.. వాటి నుంచి వెలువడిన గాలిని పీల్చుకోవడం ద్వారా వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. By Shiva.K 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మా దేశం విడిచివెళ్లాలంటే రూ.69 వేలు కట్టాల్సిందే.. పాకిస్థాన్‌ను వీడివెళ్తున్న అఫ్ఘానిస్థాన్ శరణార్థుల నుంచి ఎగ్జిట్ ఛార్జీలు వసూల్ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమంగా తమ దేశంలో ఉండి వేరే దేశాలకు వెళ్లాలనుకునే వారు 830 డాలర్లు (రూ.69 వేలు) చెల్లించేలా ఓ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ చర్యను పలు దేశాలు ఖండిస్తున్నాయి. By B Aravind 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వామ్మో.. ఆ దేశంలో ఏడు నెలల్లోనే 419 మందికి మరణశిక్షలు ఇరాన్లో ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 419 మందికి మరణశిక్ష విధించినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. భారీ స్థాయిలో మరణ శిక్షలను అమలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఐరాస.. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు లోబడి విచారణ జరగలేదని తమకు తెలిసినట్లు పేర్కొంది. By B Aravind 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: రష్యాకు ఉత్తర కొరియా నుంచి ఆయుధాల సరఫరా.. ఎందుకంటే ఉత్తర కొరియా రష్యాకు 10 లక్షల ఫిరంగి గుండ్లను ఉండొచ్చని దక్షిణ కొరియా నిఘా విభాగం తెలిపింది. నౌకలు, ఇతర మార్గాల ద్వారా రష్యాకు ఇవి వెళ్లినట్లు పేర్కొంది. అలాగే రష్యా తమ ఆయుధ సామగ్రి డిమాండుకు తగ్గట్లుగా ఆయుధ కర్మాగారాలను పూర్తి స్థాయిలో నడిపిస్తోందని చెప్పింది. By B Aravind 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India-Canda: మళ్లీ హీటెక్కిన భారత్, కెనడా వివాదం.. గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్ భారత్‌లో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకున్నామని అధికారిక ప్రకటన చేసిన కెనడా.. ఇండియాపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో భారత్.. కెనడాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇండియాలోని దౌత్య సిబ్బంది సంఖ్యపై కెనడా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యాలను చూశామని.. ఇక్కడ కెనడాకు చెందిన దౌత్యవేత్తల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొంది. అంతేగాక మన అంతర్గత విషయాల్లో వాళ్లు తరచుగా జోక్యం చేసుకుంటున్నారని.. న్యూఢిల్లీ, ఒట్టావా దౌత్యసంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలనేదే తాము కోరుకుంటున్నామని తెలిపింది. By B Aravind 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Italy: విడిపోతున్న ఇటలీ ప్రధాని జంట.. కారణం అదేనటా.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన భాగస్వామి ఆండ్రియా గియాంబ్రునోతో విడిపోతున్నారు. పదేళ్ల తమ బంధం ముగిసిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ ప్రకటన చేసింది. అయితే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఓ బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల గియాంబ్రునో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వళ్లే వారి బంధానికి ముగింపు పడినట్లు సమాచారం. తన భాగస్వామి ప్రవర్తనతో తనపై ఒక అంచనాకు రాకూడదని.. అలాగే ఆయన ప్రవర్తనపై భవిష్యత్తులో తాను ఎలాంటి సమాధానాలు ఇవ్వనని ఇటలీ ప్రధాని జార్జియా ఇప్పటికే స్పష్టం చేశారు. By B Aravind 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vladimir Putin: చైనాలో పుతిన్‌కు చేదు అనుభవం.. సభలో మాట్లాడుతుండగానే.. చైనాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు చేదు అనుభవం ఎదురైంది. బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగం ప్రారంభించగానే.. ఐరోపాకు చెందిన నేతలు, ప్రతినిధులు సభ నుంచి వెళ్లిపోయారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ భవనంలో బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి పుతిన్‌తో పాటు వివిధ దేశాల నేతలు, అలాగే 1000 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పుతిన్ మాట్లాడుతుండగా.. ఇలా ఐరోపా నేతలు మధ్యలోనే వెళ్లిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. By B Aravind 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn