Zhao Lusi: ఆస్పత్రిపాలైన 'హిడెన్ లవ్' సీరీస్ ఫేమ్ జావో లూసి!

చైనీస్ సీరీస్ 'హిడెన్ లవ్' ఫేమ్ నటి జావో లూసి ఇటీవలే ఆస్పత్రిలో చేరడంతో ఆమె ఆరోగ్యానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. జావో త్వరలోనే కోలుకుంటారని.. ప్రస్తుతం డాక్టర్ల సూచనలతో చికిత్స జరుగుతుందని తెలిపారు.

New Update
Zhao Lusi

Zhao Lusi

Zhao Lusi:  నటి జావో లూసీ చైనీస్ సీరీస్ 'హిడెన్ లవ్' తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే  ఇటీవలే లూసీ ఆస్పత్రిలో వీల్ చైర్ పై ఉన్న పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో ఆమె ఆరోగ్యానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వచ్చాయి. లూసీ డిప్రెషన్ లోకి వెళ్లిందా? లేదా ఆమెకు ఏదైనా మానసిక సమస్యా? అంటూ  వార్తలు వ్యాప్తి చెందాయి. 

Also Read: అల్లు అర్జున్ జోలికి వస్తే చంపేస్తాం! OU జేఏసీ సంచలన ఆరోపణలు

లూసీ ఆరోగ్యం పై టీమ్ ప్రకటన 

ఈ క్రమంలో తాజాగా లూసీ టీమ్..  ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఒక ప్రకటనను విడుదల చేసింది. లూసీ ప్రస్తుతం  "లవర్స్" అనే కొత్త ప్రాజెక్ట్ లో రువాన్ యూ పాత్ర చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంది. అయితే డిసెంబర్ 18న షూటింగ్ లో పాల్గొంటుంగా అనారోగ్యానికి గురైంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాము. ప్రస్తుతం ఆమెకు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. త్వరలోనే లూసీ కోలుకుంటుంది. ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు అని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. 

Also Read:యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్

లూసీ 26 సంవత్సరాల్లో తన యాక్టింగ్ కెరీర్ ని ప్రారంభించింది. "ది రొమాన్స్ ఆఫ్ టైగర్ అండ్ రోస్", "డేటింగ్ ఇన్ ది కిచెన్", "లవ్ బెటర్ ది ఇమ్మార్టాలిటీ", "లవ్ లైక్ ది గెలాక్సీ", "హిడెన్ లవ్" వంటి హిట్ సిరీస్‌లలో  లూసీ  నటించారు.

Also Read: ఒకే స్టేజ్ పై రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్.. గేమ్ ఛేంజర్ పై అదిరే అప్డేట్!

Advertisment
తాజా కథనాలు