South Korea: దక్షిణ కొరియాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య.. ఆందోళనలో ప్రభుత్వం

దక్షిణ కొరియా సూపర్ ఏజ్డ్‌ సొసైటీగా మారినట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. ఆ దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు 65 ఏళ్లు పైబడిన వారే ఉండటం గమనార్హం. 2008లో అక్కడి వృద్ధ జనాభా 49 లక్షలు ఉండగా.. 2024 నాటికి అది రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది.

New Update
old age people

old age people

ప్రపంచంలో జపాన్, చైనా, దక్షిణ కొరియా సహా పలు దేశాలు ప్రస్తుతం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి దేశాలు జనాభాను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలించడం లేదు. అయితే దక్షిణ కొరియా సూపర్ ఏజ్డ్‌ సొసైటీగా మారినట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. ఆ దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు 65 ఏళ్లు పైబడిన వారే ఉండటం గమనార్హం. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం సౌత్ కొరియా జనాభా 5.17 కోట్లు.  

Also Read: భార్యను చూసుకునేందుకు రిటైర్మెంట్‌ తీసుకున్న భర్త.. చివరికి ఊహించని షాక్

ఆ దేశ అంతర్గత, భద్రతావ్యవహారాల శాఖ తాజాగా బయటపెట్టిన వివరాల ప్రకారం.. 1.24 కోట్ల మంది 65 ఏళ్లు, ఆపైబడిన వారేనని తేలింది. ఆ దేశ మొత్తం జనాభాలో ఇది 20 శాతం. వయసైపోయిన వాళ్లలో 22 శాతం మహిళలు ఉండగా.. 18 శాతం పురుషులు ఉన్నారు. అయితే 2008లో అక్కడి వృద్ధ జనాభా 49 లక్షలు ఉండగా.. 2024 నాటికి అది రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది.   అయితే దక్షిణ కొరియాలో జీవన వ్యయం పెరగడం, వివాహాలు తగ్గడం వల్లే జనభా సంక్షోభానికి దారితీసిందని నిపుణులు చెబుతున్నారు. 

Also Read: యూపీలో దారుణం..పుట్టినరోజని పిలిచి బట్టలిప్పించి..మూత్రం తాగించారు

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 7 శాతం కంటే ఎక్కువ వృద్ధలు ఉంటే ఆ దేశాలను ఏజింగ్‌ సొసైటీగా పిలుస్తారు. 14 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఏజ్డ్‌ సొసైటీగా పేర్కొంటారు. ఒకవేళ 20 శాతం కన్నా ఎక్కువగా వృద్ధులు ఉంటే సూపర్ ఏజ్డ్ సొసైటీగా పరిగణిస్తారు. అయితే ఇప్పుడు దక్షిణ కొరియా సూప్‌ ఏజ్డ్‌ సొసైటీ జాబితాలోకి తేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 65 ఏళ్లు, ఆపైబడిన వారి సంఖ్య 2022 నాటికి 10 శాతం ఉంది. అయితే 2050 నాటికి ఇది 16 శాతానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.    

Also Read: పార్లమెంట్ దగ్గర నిప్పంటించుకున్న వ్యక్తి..పరిస్థితి విషమం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు