Tomiko Itooka: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు మృతి..

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన టోమికో ఇతోకా (116) మరణించారు. డిసెంబర్ 29న అనారోగ్య సమస్యలతో ఆమె మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. జపాన్‌కు చెందిన ఇతోకా 1908, మే 23న జన్మించారు.

New Update
Tomiko Itooka

Tomiko Itooka

జపాన్‌కు చెందిన టోమికో ఇతోకా అనే మహిళ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా కొనసాగుతున్నారు. 116 ఏళ్ల వయసున్న ఆ మహిళ ఇకలేరు. డిసెంబర్ 29న అనారోగ్య సమస్యలతో ఆమె మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గతంలో ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ కూడా సృష్టించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. టోమికో ఇతోకా.. జపాన్‌లోని ఒసాకోలో 1908, మే 23న జన్మించారు. 

Also Read: తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం!

గత ఏడాది 117 ఏళ్ల స్పెయిన్‌ దేశస్థురాలు బ్రన్యాస్‌ మృతి చెందారు. దీంతో అత్యంత వృద్ధ మహిళగా ఇతోగా నిలిచారు. అంతేకాదు గత ఏడాది ఈమె పుట్టినరోజు వేడుకలను పెద్దఎత్తున నిర్వహించారు. స్థానికంగా ఉండే ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించారు.  అయితే ఇతాకుకు కాల్పిస్ అనే ప్రత్యేక శీతల పానీయం, అరటిపళ్లంటే చాలా ఇష్టం. ఆమె స్కూళ్లో చదువుకునే రోజుల్లో వాలీబాల్ ఆడేవారు. అలాగే దాదాపు 3,067 మీటర్ల ఎత్తైన ఆన్‌టేక్ శిఖరాన్ని కూడా రెండుసార్లు అధిరోహించి రికార్డు సృష్టించారు. 20 ఏళ్ల వయసులో ఆమెకు పెళ్లి జరిగింది. ఇద్దరు కుమారులు, మరో ఇద్దరు కుమార్తెలు సంతానం. 

Also Read: అగ్రరాజ్యంలో ఆగని కాల్పులు..ఆ విషయంలో అమెరికా ఫెయిల్!

అయితే 1979లో తన భర్త మృతి చెందాడు. దీంతో ఆమె అప్పటినుంచి నర అనే నగరంలో ఒంటరిగానే జీవితం గడిపారు. మరో విషయం ఏంటంటే ఇతాకా మరణంలో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా బ్రెజిల్‌కు చెందిన కెనబర్రో లుకాస్ అనే మహిళ నిలిచారు. ప్రస్తుతం ఈమె వయసు కూడా 116 ఏళ్లు. ఇతాకా కంటే కేవలం 16 రోజులు మాత్రమే చిన్నవారు కావడం విశేషం. 

Also Read: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా?

Also Read: చనిపోయే వరకు ఇక్కడే ఉంటా.. ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు