Heavy Rain Alert: ఆ జిల్లాల వారు జాగ్రత్త..మరో రెండుగంటల్లో భారీవర్షం..
తెలంగాణను భారీ వర్షాలు వదలడం లేదు. రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. కాగా మరోసారి వాతావరణ శాఖ పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది.