Heavy Rain Alert: ఆ జిల్లాల వారు జాగ్రత్త..మరో రెండుగంటల్లో భారీవర్షం..

తెలంగాణను భారీ వర్షాలు వదలడం లేదు. రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. కాగా మరోసారి వాతావరణ శాఖ పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది.

New Update
heavy rains

Heavy Rain Alert

Heavy Rain Alert:  తెలంగాణను భారీ వర్షాలు వదలడం లేదు. రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. కాగా మరోసారి వాతావరణ శాఖ పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. మరో రెండు గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. ముఖ్యంగా వరంగల్‌ జిల్లాలో రాగల రెండు గంటల్లో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో  5 నుంచి 15 మిల్లీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉందని హెచ్చిరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దీంతో వరంగల్‌ జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది.

Also Read :   Mahindra Cars: జీఎస్టీ ఎఫెక్ట్..భారీగా తగ్గిన మహీంద్రా కార్లు..తక్షణమే అమలు

అదే సమయంలో వచ్చే రెండు మూడు గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో 5 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!

అదే సమయంలో రేపు అనగా సోమవారం నాడు  భద్రాద్రి కొత్తగూడెం,ఆదిలాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల,నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, మేడ్చల్‌,   రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read : SEAL Team 6 Mission: ఉత్తర కొరియాలో ట్రంప్ సీల్ టీమ్...పౌరుల మృతితో ఫెయిల్

బుధవారం నాడు ఆదిలాబాద్‌, , హన్మకొండ, హైదరాబాద్‌, జగిత్యాల, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం , జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి, ములుగు, మహబూబాబాద్‌, మహబూబ్‌ నగర్,  నారాయణపేట, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి భువనగిరి  సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read : Chandra Grahan 2025: నేడే చంద్ర గ్రహణం.. గర్భిణీ స్త్రీలు ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు...!

Advertisment
తాజా కథనాలు