/rtv/media/media_files/2025/07/27/rains-2025-07-27-18-08-46.jpg)
Telangana Rains
Red Alert : తెలంగాణలో గడచిన కొద్దిరోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు ఇబ్బందులు అనేక ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో వానలు విపరీతంగా కొడుతుండటంతో నగర వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకపక్క వర్షాలు దంచికొడుతుండగా.. తాజాగా.. మరోసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఈనెల 27వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
మరోసారి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పాడటంతో ఈ నెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం కారణంగా ఈ నెల 26, 27 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 25న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి, 26వ తేదీ నాటికి అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటనుంది. దీని ప్రభావంతో 26న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది.
26న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల 10 నుంచి 20 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. 27న ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురవనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మరోవైపు.. ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా సాయంత్రం సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నగరంలో ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే, లోతట్టు ప్రాంతాల ప్రజలు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి: కోల్‌కతాలో రికార్డు స్థాయిలో వర్షం.. 9 మంది మృతి, 30 విమానాలు రద్దు