/rtv/media/media_files/2025/08/16/rains-2025-08-16-09-40-24.jpg)
IMD warns 14 states.. Heavy rains tomorrow
Rain Alert: దేశవ్యాప్తంగా మళ్లీ వాతావరణం మారబోతుంది. భారత వాతావరణ విభాగం (IMD) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, రేపు దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో పెద్దఎత్తున వర్షాలు కురవనున్నాయి. గుజరాత్, రాజస్థాన్, అస్సాం, మేఘాలయ, బీహార్, బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాబోయే రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. ఈ ఈ మేరకు ఐఎండీ తాజా వాతావరణ బులెటిన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గుజరాత్, రాజస్థాన్‌లకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఐఎండీ నివేదిక ప్రకారం, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం మధ్య గుజరాత్, సౌరాష్ట్ర, కచ్, తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఈ రెండు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు నీటిముంపునకు గురయ్యే అవకాశముందని ఐఎండీ తెలిపింది. రవాణాకు అంతరాయం కలగవచ్చు.
మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లో వర్షాలు పడుతున్నాయి. తూర్పు, పశ్చిమ మధ్యప్రదేశ్, సుబ్‌హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలో వేర్వేరు ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు బీహార్, ఛత్తీస్‌గఢ్‌లో వర్షాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.
అలాగే, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ప్రస్తుతం కురుస్తున్న వానలు సెప్టెంబర్ 11 వరకు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో 9 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈశాన్య రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇక తమిళనాడులో ఆదివారం నుంచి (సెప్టెంబర్ 7న) 10 తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కేరళ, మాహే ప్రాంతాల్లో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, ఏపీలలో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, రాయలసీమలో వచ్చే 5 రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 30–40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వానలు దంచికొడుతున్నాయి. దీంతో వరదలు, భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పెద్దమొత్తంలో ప్రాణనష్టం సంభవించింది. ఢిల్లీ యమునా నది నీటి మట్టం ఇప్పటికే 207.48 మీటర్లకు చేరుకుంది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగే ప్రమాదం ఉందని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఈ క్రమంలోనే అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ అమలులో ఉందని తెలిపారు. జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, హర్యానా, పశ్చిమ రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్రలోని కొంకణ్, గోవా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.దేశవ్యాప్తంగా వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, ఐఎండీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. మాన్సూన్ ప్రభావం కారణంగా రాబోయే రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది.
Also Read : SEAL Team 6 Mission: ఉత్తర కొరియాలో ట్రంప్ సీల్ టీమ్...పౌరుల మృతితో ఫెయిల్