Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల  నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ముంపు ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు.

New Update
CM Revanth Hyderabad Heavy Rains

హైద‌రాబాద్‌(Hyderabad) తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల(Heavy Rains)  నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు వ‌ర్షాలు ఉంటాయ‌నే స‌మాచారం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తగు నిర్ణయాలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉందన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని స్పష్ట చేశారు.

Also Read :  హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం.. ఆ ప్రాంతాల వారికి హెచ్చరిక

అవసరమైతే తప్పా బయటకు రావొద్దు..

లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ సిటీలో ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని.. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సీఎం సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్ భారీ వర్ష సూచనపై ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. సీఎస్, డీజీపీతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

Also Read :  హైదరాబాద్‌కు క్లౌడ్ బరస్ట్ హెచ్చరిక... ఎవరూ బయటకు రావొద్దని సూచన

Advertisment
తాజా కథనాలు