Rain Alert: నీటమునిగిన హైదరాబాద్‌...చిగురుటాకులా వణికిన నగరం

ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగరం చిగురుటాకులా వణికిపోయింది. ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన కుండపోత వర్షం పడుతుండటంతో నగరమంతా అస్థవ్యస్తంగా మారింది. ఎటు చూసిన మోకాళ్లలోతులో నీళ్లు నిలిచిన రోడ్లే దర్శనమిస్తున్నాయి.

New Update
Rain Alert:

Rain Alert:

Rain Alert: ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగరం చిగురుటాకులా వణికిపోయింది. ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన కుండపోత వర్షం పడుతుండటంతో నగరమంతా అస్థవ్యస్తంగా మారింది. ఎటు చూసిన మోకాళ్లలోతులో నీళ్లు నిలిచిన రోడ్లే దర్శనమిస్తున్నాయి.  నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరద నీరు రోడ్లపైకి చేరడంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వర్ష బీభత్సానికి నగరంలోని కొన్ని ప్రాంతాలు కరెంట్ లేక చీకటిలో చిక్కుకుపోయాయి. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో బస్తీ వాసులు, లోతట్టు ప్రాంత ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. చాలా వరకు ఇండ్లలోకి వరద నీరు చేరుకోవడంతో బస్తీల వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు.భారీ వర్షాలు సిటీలో అల్లకల్లోలం సృష్టిస్తుండటంతో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎస్ బృందాలు అప్రమత్తమై రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశాయి.

నగరంలోని  జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, ఎల్బీనగర్, నాగోలు, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్ పూర్ మెట్ ఏరియాల్లో భారీ వర్షంతో రోడ్లపై నీళ్లు పారుతున్నాయి. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, ఐకియా ఏరియాల్లో ట్రాఫిక్ నిదానంగా సాగుతుంది.దిల్ షుఖ్ నగర్, మలక్ పేట్, అత్తాపూర్, కొత్తపేట, చంపాపేట ఏరియాల్లో వర్షం భారీగా పడుతుంది. సాయంత్రం మొదలైన వర్షం అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. హైదరాబాద్ పాతబస్తీలోనూ భారీ వర్షంతో.. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, కాంచన్ బాగ్, షాలిబండ, ఛత్రినాక, సికింద్రాబాద్, కంటోన్మెంట్ ఏరియాల్లో భారీ  వర్షం పడుతుండటంతో.. రోడ్లపై నీళ్లు నిండిపోయాయి.. వాహనదారులు ఎక్కడికక్కడ రోడ్ల పక్కన ఆగిపోయారు.

వరద నీటిలో అమీర్‌ పేట


భారీ వర్షానికి అమీర్‌ పేట పూర్తిగా నీట మునిగింది. మైత్రివనం పూర్తిగా నీటితో నిండిపోవడంతో మెట్రోకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు వెళ్లలేక ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.సైబర్‌ సిటీ ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకుంది. మాదాపూర్‌, హైటెక్‌సిటీ, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఖైరతాబాద్‌ నుంచి జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్థమైంది.

Advertisment
తాజా కథనాలు