Latest News In Telugu Bandi Sanjay: రాష్ట్రంలో దద్దమ్మ సర్కార్ పాలన కొనసాగుతోంది సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరీక్షలు నిర్వహించడం చేతకాని దద్దమ్మ కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన టెట్ పరీక్షల్లో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయన్నారు. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నాగర్ కర్నూల్ ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టులో పిటీషన్ నాగర్ కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ వసతి గృహంలో గురువారం జరిగిన ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని న్యాయవాది చిక్కూడి ప్రభాకర్ హైకోర్టులో వేసిన పిటీషన్లో తెలిపారు. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వానికి షాక్..టీటీడీ ట్రస్ట్ సభ్యులకు హైకోర్టు నోటీసులు! టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, దేశాయ్ నికేతన్, శరత్ చంద్రారెడ్డి లను ఏపీ ప్రభుత్వం నియమించింది. వీరి నియామకం గురించి సవాలు చేస్తూ మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. By Bhavana 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Quash Petition: నేడు హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ మీద విచారణ జరగనుంది. అలాగే నేడు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో బెయిల్ మంజూరు కోసం వేసిన పిటిషన్ మీద కూడా విచారణ జరగనుంది. By Manogna alamuru 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu:ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన చంద్రబాబు లాయర్లు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైనమెంట్ మార్పు కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరఫున లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు DK Aruna: స్పీకర్ తన కాల్‌ను లిఫ్ట్ చేయడం లేదు హైకోర్టు ఆర్డర్ కాపీతో డీకే అరుణ అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో హైకోర్టు ఆర్డర్ కాపీని ఆమె అసెంబ్లీ సిబ్బందికి ఇచ్చినట్లు తెలిపారు. స్పీకర్ వెంటనే హైకోర్టు ఆర్డర్ కాపీని ఇంప్లిమెంట్ చేయాలని డీకే అరుణ కోరారు. By Karthik 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court: మార్గదర్శి సంస్థలపై దాడులు చేయొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశాలు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు మార్గదర్శి సంస్థలపై ఎలాంటి దాడులు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి సంస్థలపై పలు ప్రభుత్వ శాఖలు ఇటీవల దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులను నిరసిస్తూ మార్గదర్శి యాజమాన్యం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై సోమవారం ఏపీ హైకోర్టు విచారణ చేసింది. మార్గ దర్శి తరపున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. వాదనల అనంతరం మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మార్గదర్శి సంస్తలపై ఎలాంటి దాడులు చేయవద్దని న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. By E. Chinni 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పంద్రాగష్టు వేడుకల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం.. నాటి స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితమే అని పేర్కొన్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా నేల పాడులోని హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. వివిధ మతాలు, వర్గాలు ఉన్నప్పటికీ అందరూ కలిసి స్వాతంత్య్రం కోసం ఏకతాటిపై పోరాడటం వల్లే బ్రిటీష్ వాళ్లను తరిమికొట్టామన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు నిత్యం పహారా కాస్తూ ఉండటం వల్లనే దేశ ప్రజలకు స్వేచ్ఛ కొనసాగుతుందన్నారు. బలమైన రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం కారణంగానే ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడుకుంటున్నామని.. ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. నిరక్షరాస్యత,పేదరికం, అవగాహన, చట్టాలు తెలియకపోవటం వల్ల చాలా మంది తమ హక్కుల్ని కాపాడుకోలేకపోతున్నారని చెప్పారు. ఆర్టికల్ 39 ప్రకారం అందరికీ న్యాయ సహాయం అందేలా చూడాలని చెప్పారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana High Court: రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారు..?.. ప్రభుత్వాన్ని నివేదిక కోరిన హైకోర్టు ఆ రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారు?.. అంటువ్యాధులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు..?.. మృతులకు ఎంత నష్ట పరిహారం చెల్లించారు..? అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై రెండో సారి నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు అందజేసింది. దీంతో ధాఖలైన పిల్‌ను విచారించిన హైకోర్టు సమగ్ర నివేదికను కోరింది. By Vijaya Nimma 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn