Patnam Narender reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్

TG: లగచర్ల ఘటనలో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన 3 FIRలలో రెండిటిని హైకోర్టు కొట్టేసింది. కాగా లగచర్ల అల్లర్ల కేసులో అరెస్టైన నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు.

New Update
Patnam Narender reddy

Patnam Narender Reddy: లగచర్లలో కలెక్టర్ పై జరిగిన దాడి కేసులో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై నమోదు అయిన మూడు FIR లలో రెండు FIRలను హైకోర్టు కొట్టేసింది. కాగా ఒక ఘటనలో మూడు FIRలు నమోదు చేయడం చట్టవిరుద్ధం అని పట్నం నరేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ FIRలను కొట్టేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. రెండు FIRలను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.

ఇది కూడా చదవండి: నాకు రాజ్యసభ సీటు వద్దు.. నాగబాబు సంచలన ట్వీట్!

ఇటీవల పట్నం వీడియో వైరల్..

వీడియోలో పట్నం నరేందర్ రెడ్డి ఇలా మాట్లాడారు.. మొన్న జరిగింది ట్రైలరే.. రాబోయే రోజుల్లో డబుల్‌, త్రిబుల్‌ దాడులు ఉంటాయని అన్నారు. ఫార్మా కంపెనీ పేరిట వస్తే తరిమికొడతామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ నేతలు వచ్చినా, కలెక్టర్‌ వచ్చినా తరిమి కొడతామని అన్నారు. మీకు నేను, కేటీఆర్‌, హరీష్‌రావు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇది కూడా చదవండి: BREAKING: వైసీపీ మాజీ మంత్రి పీఏ అరెస్ట్!

అందరూ ధైర్యంగా ఉండాలని కేటీఆర్‌ అన్నారన్న.. మళ్లో సారి వస్తే కేటీఆర్‌ రంగంలోకి దిగుతారని చెప్పారు. ఎవరొస్తరో రానీయండి చూసుకుందామని.. ఫార్మాను రద్దు చేసే వరకు మీ వెంటనే ఉంటామని ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వీడియోతో పాటు పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ చెప్పిన విషయాలు ఆధారం చేసుకొని పోలీసులు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ అరెస్ట్ పై సస్పెన్స్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. 

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌పై పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా

ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!

Advertisment
తాజా కథనాలు