TG: మూసీ నిర్వాసితులకు హైకోర్ట్ బిగ్ షాక్..కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్ మూసీనది ప్రక్షాళనపై హైకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది.నదిలో మురుగునీరు కలవకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. By Bhavana 27 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Musi River : మూసీ సుందరీకరణకు మార్గం సుగమమైంది. మూసీ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలు తొలగించేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది అక్రమ నిర్మాణాలను తొలగించడం తో పాటు కలుషిత నీరు నదిలో కలవకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి తెలిపింది. సుందరీకరణతో ఎవరి ఆస్తులు పోతున్నాయో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి పేదలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని హైకోర్టు చెప్పింది. Also Read: Pawan: పిఠాపురంలో నాలుగు ప్రధాన రైళ్లు..రైల్వే మంత్రితో పవన్ భేటీ! మూసీనదీగర్భం, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్లో చట్టవిరుద్దంగా, అనధికారికంగా ఉన్న నివాసాలను ఖాళీ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు మురుగునీరు, కలుషిత నీరు రాకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించి మూసీ పునరుజ్జీవంతో ఎవరి ఆస్తులైతే ప్రభావితమవుతాయో వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని పేర్కొంది. ఆక్రమణలో ఉన్న పట్టాభూములు, శిఖం భూములైతే వారికి సమాచారం ఇవ్వడం లేదా ఆ భూయజమానులకి నోటీసులు జారీచేసి చట్టం ప్రకారం తగిన పరిహారం చెల్లించడం ద్వారా సేకరించాలని అధికారులను ఆదేశించింది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా నివాసాలు ఖాళీ చేయించడంతో పాటు , కూల్చివేతలను సవాల్‌చేస్తూ దాఖలైన 46 పిటిషన్లపై జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టి తీర్పు ని ప్రకటించారు. హైకోర్టు ఏమందంటే.. మూసీ బఫర్‌జోన్, ఎఫ్టీఎస్, రివర్‌బెడ్ జోన్లలోని ఆక్రమణదారుల నిర్మాణాలను తొలగించే సమయంలో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలి.అక్రమణ నిర్మాణాల తొలగింపుపై స్టే తాత్కాలిక ఉత్తర్వులిచ్చే ముందు హైకోర్టు పంపిన సర్క్యులర్‌ను కింది కోర్టులు అమలు చేయాలి. Also Read: Rahul:రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దుపై పిటిషన్..ఆలోచిస్తున్నామన్న కేంద్రం ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను అధికారులు గుర్తించేందుకు నిర్వహించే సర్వేకి పిటిషనర్లు, ప్రజలు, ఆక్రమణదారులు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా సంయమనం పాటించాలి. మూసీ రివర్‌బెడ్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లోని తాత్కాలిక, అనధికారిక నిర్మాణాలను నిర్దిష్ట గడువులోగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.2012 బిల్డింగ్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.నిబంధనలకు విరుద్ధంగా మూసీ నదిలో నిర్మాణాలుంటే చట్టప్రకారం తొలగించాలని హైకోర్టు తెలిపింది. Also Read: Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అదిరిపోయే వార్త..ఏకంగా 85 శాతం బోనస్ మూసీలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై కింది కోర్టులు ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసే ముందు 2023లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలోమెనా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి.కోర్టు ఉత్తర్వుల అమలుకి నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖలకు పోలీసులు అవసరమైన భద్రతను కల్పించాల్సిన అవసరం ఉంది. నదులు, నీటివనరులు, సరస్సులు, చెరువులను ఆక్రమించుకున్న అక్రమార్కులు, భూకబ్జాదారులపై ఇరిగేషన్ చట్టం 1357, వాల్టా చట్టం కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. Also Read: Cinema: 47 ఏళ్లకు పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజు..వధువు ఎవరో తెలుసా? ఏ నిర్మాణాలు చేయరాదు : నీటి వనరుల పరిరక్షణలో భాగంగా పూడికతీత, కట్టలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టింది. హైకోర్టు దానిలో భాగంగా ప్రభుత్వం 2012లో బిల్డింగ్ నిబంధనలు రూపొందిస్తూ జీవో 168 జారీ చేసినట్లు ప్రకటించింది. ఆ నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఏ నిర్మాణాలు చేపట్టకూడదని తెలిపింది. దేశంలోనే తొలిసారిగా 48 వేల మేజర్, మైనర్ చెరువుల్లో పూడికతీతని దశలవారీగా చేపట్టాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందని పేర్కొంది. ట్యాంకులు, చెరువుల భూములని నిషేధిత జాబితాలో చేరుస్తూ సీసీఎల్ఏ సర్క్యులర్ జారీ చేశారని ప్రకటించింది. ఇన్ని చేసినా చెరువులను అక్రమార్కుల బారినుంచి రక్షించలేకపోయారని తెలిపింది. చెరువుల పరిరక్షణ సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో భూకేటాయింపుల విధానం తీసుకొచ్చిందని తెలిపింది. #telangana #high-court #musi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి