Milk: పాలు, గుడ్లు ఒకేసారి తీసుకుంటే ఏమౌతుంది?
కొన్ని ఆహార పదార్థాల కాంబినేషన్లు శరీరానికి మంచిది కావు. ఉడికించిన గుడ్లు తిన్న తర్వాత పాలు తాగితే గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉడికించిన గుడ్లు తిన్నాక అవసరమైతే పాలు తీసుకోవాలని నిపుణులంటున్నారు.