/rtv/media/media_files/2025/07/19/animals-health-2025-07-19-16-47-22.jpg)
Animals Health
మనుషులకు జలుబు, జ్వరం, కడుపు నొప్పి వచ్చినప్పుడల్లా.. మందులు తీసుకుంటారు. వైద్యుడి వద్దకు వెళ్లటం, మరి కొందరు ఇంటి నివారణలను పోలో అవుతారు. కానీ అడవిలో నివసించే జంతువులు అనారోగ్యానికి గురైనప్పుడు ఏమి చేస్తాయి..? వాటికి మందులు, వైద్యులు, ఆస్పత్రులు లేవు అయినప్పటికీ అవి ఎలా తగ్గించుకుంటాయానే డౌట్ వస్తుంది. జంతువులకు ప్రత్యేకమైన సహజ మేధస్సు ఉంటుందట. ఇది అనారోగ్యం విషయంలో సరైన చర్యలు తీసుకోవడానికి వాటిని ప్రేరేపిస్తుంది. అవి అడవిలో ఉన్న ప్రత్యేక మొక్కలు, నేల, నీరు, విశ్రాంతి సహాయంతో తమను తాము నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read : ఉరిశిక్ష రద్దు.. నిమిష ప్రియ విడుదల!
జంతువులు తమను తాము చూసుకునే విధానం..
ఆఫ్రికా అడవులలో కనిపించే చాలా కోతులు కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు ఒక ప్రత్యేక రకమైన చేదు ఆకులను నమిలేస్తాయి. ఈ ఆకులు వాటి సాధారణ ఆహారంలో భాగం కావు.. కానీ అవి అనారోగ్యంగా ఉన్నప్పుడు వాటిని వెతుక్కుని తింటాయి. ఈ ఆకులు సహజ పరాన్నజీవి నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. పెంపుడు కుక్కలు కొన్నిసార్లు గడ్డి తిని తర్వాత వాంతి చేసుకోవడం చూసి ఉంటారు. ఇది వాటి కడుపులో ఏదో సమస్య ఉందని సూచించే సాధారణ ప్రవర్తన. గడ్డి తినడం వాటికి ఒక రకమైన డీటాక్స్‌గా పనిచేస్తుంది. ఇది వాటికి ఉపశమనం ఇస్తుంది. ఏనుగులు అనారోగ్యంగా అనిపించినప్పుడు లేదా జీర్ణ సమస్యలు వచ్చినప్పుడు. అవి ఒక ప్రత్యేక రకమైన మట్టిని తింటాయి. ఈ నేలలో ఉండే ఖనిజాలు వాటి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనిని జియోఫాగి అంటారు.
ఇది కూడా చదవండి: మహిళలు గర్భం గురించి తెలియకుండానే ప్రసవించగలరా..? ఇదిగో షాకింగ్ నిజాలు
పిల్లులు తమ శరీరాలను తరచుగా నాకుతాయి. ఇది కేవలం శుభ్రత కోసమే కాదు.. శరీర ఉపరితలంపై ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను తొలగించే సహజ ప్రక్రియ. ఇది వాటిని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. పిచ్చుకలు, పావురాలు వంటి కొన్ని పక్షులు ఇసుకలో తిరుగుతాయి. ఇది ఆట కాదు కానీ అవి తమ ఈకల నుంచి పరాన్నజీవులను తొలగించే సహజ మార్గమని.. దీనిని డస్ట్ బాత్ అని అంటారు. ప్రకృతి జంతువులకు అద్భుతమైన అవగాహనను ఇచ్చింది. అవి తమ వ్యాధులను తామే నయం చేసుకోగలవు. అవి ఏ వైద్యుడు, మందులు లేకుండానే తమను తాము నయం చేసుకోగలవు. ప్రకృతికి దగ్గరగా ఉండి దాని సంకేతాలను అర్థం చేసుకుంటే...జీవితాన్ని, ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోగలమని వీటి ద్వారా తెలుసుకోవచ్చు.
Also Read : ఆ ఒక్క అలవాటే ఫిష్ వెంకట్ కొంప ముంచింది.. షాకింగ్ నిజాలు చెప్పిన క్లోజ్ ఫ్రెండ్!
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెగిపడిన మహిళ తల!
(pets-animals | wild-animals | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News)